• క్రికెటర్, నటీమణి నిశ్చితార్థం జరిగింది!
  Published Date : 24-May-2017 8:38:01 IST

  బాలీవుడ్ నటీమణి సాగరికా ఘట్గే, మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ల నిశ్చితార్థం జరిగింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న యువరాజ్ సింగ్ సతీసమేతంగా హాజరు కాగా, ప్రేమలో ఉన్న విరాట్ కొహ్లీ, అనుష్కా శర్మలు జంటగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గత కొన్నాళ్లుగా జహీర్, సాగరికలు ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చక్ దే ఇండియా వంటి సినిమాలో నటించింది సాగరిక.

 • పవన్ ట్విటర్లో కొత్త ఖాతా ఓపెన్ చేసుకోవాల్సిందేనా!
  Published Date : 24-May-2017 8:36:01 IST

  తన ట్విటర్ అకౌంట్ హ్యాక్ కు గురి అయ్యిందని ఆ మధ్య ప్రకటించాడు పవన్. మరి అసలు కథేమిటీ అంటే.. ఇన్నాళ్లూ పవన్ ట్విటర్ ఖాతాను హ్యాండిల్ చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించారట. ఆ ఖాతా కు సంబంధించిన ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అన్నీ తొలగించిన ఉద్యోగి దగ్గరే ఉన్నాయట. ప్రస్తుతం అతడు అందుబాటులో లేడు. దీంతో.. లాగిన్ కావడం కానీ, పాస్ వర్డ్ మార్చుకోవడం కానీ సాధ్యం కావడం లేదట. మరి పవన్ ట్విటర్ లో కొత్త ఖాతా తెరవాల్సిందేనేమో!

 • చలపతి రావు వివరణ..మరింత దుమారం!
  Published Date : 23-May-2017 10:15:05 IST

  తన వివాదాస్పద వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పూ లేదని చెప్పుకొచ్చిన సినీ నటుడు చలపతిరావు మాటలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. తన భార్య మరణానంతరం తను ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదని చెప్పకొచ్చిన ఈ నటుడు ఈ విషయాన్ని చెప్పడానికి ‘అడ్డమైన ఆడవాళ్లతో తిరగలేదు…’ అని చెప్పడం వివాదాన్ని రేపుతోంది. చలపతిరావు వివరణలో కూడా ఆడవాళ్ల విషయంలో ఇలాంటి అనుచిత భాషాప్రయోగాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. అయితే చలపతి మాత్రం ఎదురుదాడి చేస్తున్నారు.

 • హీరోగా వస్తున్న మరో నటుడి తనయుడు..!
  Published Date : 23-May-2017 10:12:31 IST

  బాలీవుడ్ ధిగ్గజ నటుడు ధర్మేంద్ర మనవడు, నటుడు సన్నీ డియోల్ తనయడు కరణ్ డియోల్ హీరోగా తెరకు పరిచయం కానున్నాడు. తాజాగా ఆ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో సన్నీ డియోల్ తనయుడితో దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ విధంగా ధర్మేంద్ర ఇంటి నుంచి మూడో తరంలో హీరో వస్తున్నాడు. ధర్మేంద్ర తనయులు సన్నీ, బాబీలు బాలీవుడ్ లో ప్రముఖనటులుగా నిలిచారు. ధర్మేంద్ర కూతురు కూడా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఆయన మనవడు వస్తున్నాడు.

 • పోటీ లేకుండా ఎన్నుకుందాం అంటున్న జగన్
  Published Date : 23-May-2017 10:09:43 IST

  రాష్ట్రపతి ఎన్నికలపై మరోసారి స్పందించాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే తమ మద్దతు ఎన్డీయే అభ్యర్థికే అని స్పష్టం చేసిన జగన్ మోహన్ రెడ్డి అసలు పోటీనే వద్దు అని ప్రతిపక్ష పార్టీలకు సూచన చేశాడు. రాష్ట్రపతి అభ్యర్థిని పోటీ లేకుండా ఎన్నుకుంటే ఆయన నిస్పాక్షికంగా పని చేసే అవకాశం ఉందని జగన్ అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక అభ్యర్థిని నిలిపే అవకాశాలున్నాయి. కరుణానిధి పుట్టిన రోజువేడుకల వేదికగా వాని అభ్యర్థిపై చర్చ జరగనుంది.

 • విప్రో.. ఎంత మందిని ఇంటికి పంపుతోంది..?
  Published Date : 22-May-2017 7:35:32 IST

  దేశీయ ఐటీ దిగ్గజం విప్రో ఇండస్ట్రీస్ పై ఆటోమేషన్ ప్రభావం తీవ్రంగానే పడుతోంది. ఇండియన్ ఐటీ పరిశ్రమకు సంక్షోభం సంభవించిందన్న ఊహగానాల మధ్య విప్రో వేట చర్చనీయాంశంగా మారింది. ఒక అంచనా ప్రకారం విప్రో పది శాతం ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్టుగా తెలుస్తోంది. విప్రోలో దాదాపు లక్షా ఎనభై వేల మంది పని చేస్తున్నారు. వీరిలో పదిశాతం మందిని ఈ ఏడాది ఇంటికి పంపించవచ్చని అంచనా. ఓవరాల్గా మూడేళ్లలో నలభై ఏడు వేల మందిని ఇంటికి పంపాలనేది విప్రో ప్రణాళికగా తెలుస్తోంది.

 • సినిమా వాళ్లు రాష్ట్రాన్ని పాడు చేశారు!
  Published Date : 22-May-2017 7:32:24 IST

  తమ రాష్ట్రాన్ని సినిమా వాళ్లు పాడు చేశారని అన్నారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం పై స్వామి మాట్లాడుతూ.. రజనీ రాజకీయానికి పనికిరాడు అని తేల్చేశాడీయన. రజనీ బీజేపీకి చేరే అవకాశాలను కూడా స్వామి కొట్టి పడేశారు. కామరాజ్ నాడార్ హయాంలో తమిళనాట మంచి అభివృద్ది జరిగింది అని.. తర్వాత వచ్చిన సినిమా వాళ్లు రాష్ట్రాన్ని నాశనం చేశారని స్వామి వ్యాఖ్యానించారు. సినీ రంగానికే చెందిన రజనీ రాజకీయ ప్రవేశాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 • నారాయణ రెడ్డికి వైఎస్ జగన్ నివాళి
  Published Date : 22-May-2017 7:31:05 IST

  రాజకీయ ప్రత్యర్థుల చేతిలో హత్య కు గురి అయిన పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నారాయణ రెడ్డికి నివాళిఘటించిన జగన్ ఆయన కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. అంత్యక్రియల్లో నారాయణ రెడ్డి అభిమానులు, సామాన్య ప్రజానీకం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ రాజకీయ హత్యాకాండపై జగన్ గవర్నర్ నరసింహన్ కు కూడా ఫిర్యాదు చేశారు.

 • టాప్ హీరోలపై మణిశర్మ హాట్ కామెంట్స్!
  Published Date : 21-May-2017 9:29:11 IST

  ఈ రోజుల్లో గుర్తుండిపోయే పాటలు రాలేదంటే దానికి కారణం హీరోలే అని తేల్చాడు సంగీత దర్శకుడు మణిశర్మ. కొంతమంది హీరోలు మాస్ బాణీలు కావాలని అంటారని, మరికొందరు డాన్స్ కు తగ్గట్టైన సంగీతం కావాలని అంటారని.. అందుకే మంచి పాటలు రావడం లేదని మణిశర్మ వ్యాఖ్యానించాడు. ఖలేజా, తీన్ మార్, శక్తి వంటి సినిమాలకు తను మంచి సంగీతాన్ని అందించలేకపోవడానికి కారణం ఆ పరిమితులే కారణమేమో అని ఈ సంగీతదర్శకుడన్నాడు.

 • సమంత, చైతూ.. పెళ్లి ముహూర్తం ఫిక్స్
  Published Date : 21-May-2017 9:26:16 IST

  పెళ్లి ముహూర్తం గురించి ఇన్నాళ్లూ గుంభనంగానే ఉండిన నాగచైతన్య ఇప్పుడు స్పందించాడు. చాన్నాళ్ల కిందటే సమంత, చైతూల ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లెప్పుడనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో చైతూ స్పందిస్తూ అక్టోబర్ లో పెళ్లి అని ప్రకటించాడు. హిందూ, క్రిస్టియన్.. రెండు సంప్రదాయాల్లో పెళ్లి ఉంటుందని చెప్పాడు. మరి డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. సమంత తమ కుటుంబంతో బాగా కలిసిపోయిందని కాబోయే భార్యకు చైతూ కితాబిచ్చాడు.

 • ఆ హీరోయిన్ తో 30 సినిమాలు చేయాలనుందట..!
  Published Date : 21-May-2017 9:23:07 IST

  రాజ్ తరుణ్, హేబా పటేల్.. వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. ముందుగా ‘కుమారి 21 ఎఫ్’ లో వీరిద్దరూ జంటగా నటించగా, ఆ తర్వాత ‘ఆడో రకం.. ఈడో రకం’ సినిమాలో కూడా వీరిద్దరూ జంటగా నటించారు. ఇప్పుడు ‘అంధగాడు’ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. తాజాగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. హేబా తో మూడు కాదు, ముప్పై సినిమాలు చేయాలనుందని అన్నాడు. ఆమె పని అంత బాగుంటుందన్నాడు.

 • కన్నడీగులను కెళికిన రామ్ గోపాల్ వర్మ!
  Published Date : 19-May-2017 9:46:28 IST

  ‘తెలుగులో వచ్చిన బాహుబలి-2 సినిమా కర్ణాటకలో అక్కడి సినిమాల కంటే భారీ విజయం సాధించింది. కన్నడిగులు చేసే డబ్బింగ్ సినిమాల రికార్డులను ఓ తెలుగు సినిమా చెరిపేసింది. దీన్నిబట్టి కన్నడిగులకు కావాల్సింది ఓ మంచి సినిమా మాత్రమేనని అర్థమవుతోంది. కన్నడిగులు తమ భాషలో వచ్చిన సినిమా కంటే తెలుగులో వచ్చిన బాహుబలినే ఎక్కువ సార్లు చూస్తున్నందుకు కర్ణాటక వాసులంతా ఆందోళన చేపట్టాలి’ కన్నడీగులను కెళికాడు దర్శకుడ రామ్ గోపాల్ వర్మ. కన్నడనాట డబ్ సినిమాలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.

 • అసాంజేకు స్వేచ్ఛ లభించినట్టేనా..?
  Published Date : 19-May-2017 9:45:38 IST

  స్వీడన్ లోతనపై నమోదైన రేప్ కేసు నుంచి వికీలీక్స్ వ్యవస్థాపకడ జూనియన్ అసాంజేకు విముక్తి లభించింది. ఈ కేసుపై విచారణ, ధర్యాప్తులను పూర్తిగా నిలిపేస్తున్నట్టుగా స్వీడన్ కోర్టు ప్రకటించింది. దీంతో అసాంజేపై నమోదైన కేసు నుంచి ఊరట లభించింది. గత ఐదేళ్లుగా అసాంజే లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న విషయం విదితమే. అయితే ఈ కేసు కొట్టివేయడంతో.. అసాంజే ఎంబసీ నుంచి బయటకు రాగలడా? అనేదానిపై క్లారిటీ లేదు.

 • రజనీ మాటలపై.. రాజకీయనేతలేమన్నారంటే..
  Published Date : 19-May-2017 9:41:46 IST

  రాజకీయాల్లోకి వస్తానన్న సానుకూల సందేశాన్ని అభిమానులకు ఇచ్చాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ నేపథ్యంలో కొందరు తమిళ రాజకీయ నేతలు ఘాటుగా స్పందించారు. మందుగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మాట్లాడుతూ.. రజనీ కి స్థిమితం లేదన్నాడు. మళ్లీ మనసు మార్చుకోవచ్చని వ్యాఖ్యానించారాయన. ఇక అన్బుమణి రాందాస్ మాట్లాడుతూ.. తమిళనాడుకు ఇప్పుడు యాక్టర్లతో పని లేదని, రాజకీయాన్ని మార్చడానికి డాక్టర్లు కావాలని అన్నాడు. రాందాసు స్వతహాగా డాక్టరు!

 • తన సినిమా చాలా హాట్ అంటున్న హీరోయిన్!
  Published Date : 18-May-2017 9:20:43 IST

  తను నటించిన బేవాచ్ సినిమా చాలా చాలా హాట్ అని అంటోంది ప్రియాంక చోప్రా. ఎంతలా అంటే.. ఈ సినిమాను చిన్న పిల్లలకు చూపకపోవడమే మేలు అని ఈమె ప్రేక్షకులకు సూచిస్తోంది. మైనర్ పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రియాంక ఈ సూచన చేస్తోంది. మీరు సినిమా చూడండి కానీ, పిల్లలను మాత్రం తీసుకురాకండి.. అని ప్రియాంక సూచిస్తోంది. మరి పిల్లలు చూడకూడనంత హాట్ గా ఉంటుందని అంటూనే.. పెద్దలను ఊరిస్తోంది ప్రియాంక.