• అవికా గోర్ సంచలన ఆరోపణ..!
  Published Date : 16-Sep-2017 5:26:34 IST

  హీరోయిన్ గా తన కెరీర్ ను నాశనం చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది అవికా గోర్. తను సినిమాల్లో నటించడం మానేసినట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నటిగా కొన్ని సక్సెస్ లు చూసిన తనకు కొత్తగా అవకాశాలు రాకపోవడానికి ఆ ప్రచారమే కారణమని వాపోతోంది. టాలీవుడ్ లోని కొంతమంది సీనియర్లు ఈ ప్రచారాన్ని చేస్తున్నారని, దర్శకులకు ఫోన్లు చేసి తనను తీసేయమని చెబుతున్నారని అవికా అంటోందని తెలుస్తోంది.

 • తేజకు స్టార్ హీరో సినిమా దక్కిందా..?
  Published Date : 16-Sep-2017 5:24:48 IST

  నేనే రాజు నేనే మంత్రి సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న తేజాకు మంచి డిమాండే కనిపిస్తోంది. ఇప్పటికే తమిళ హీరో కార్తీ ఈ డైరెక్టర్ ను సంప్రదించాడట. సినిమా చేద్దామని ప్రతిపాదించాడట. ఆ సంగతాల ఉంటే..తేజకు బాలయ్య కూడా ఛాన్స్ ఇస్తున్నాడనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం కేఎస్ రవికుమార్ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. తన తదుపరి సినిమాను తేజ దర్శకత్వంలో చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 • మహానటిలో మరో స్టార్..!
  Published Date : 16-Sep-2017 5:22:25 IST

  ఇప్పటికే పలువురు స్టార్లు మహానటి సినిమాలో నటించడానికి సమ్మతి తెలియజేశారు. కొందరు షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ హీరో ఖరారు అయ్యాడు. ఆయనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. లెజెండరీ నటుడు ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే తాజాగా అందుకు సంబంధించి ధ్రువీకరణ వచ్చింది. ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.


 • Widget not in any sidebars
 • నితిన్ ఆ హీరోయిన్.. మధ్య ఏం నడుస్తోంది?
  Published Date : 12-Sep-2017 6:18:03 IST

  మామూలుగా ఫెయిల్యూర్ అయిన హీరోయిన్ కే మరో అవకాశం ఇవ్వరు. అదే హీరో సరసన అయితే అస్సలు ఛాన్సే లేదు. కానీ.. నితిన్ తీరు మాత్రం తేడా ఉంది. ‘లై’ సినిమాలో తన సరసన నటించిన మేఘా ఆకాష్ తో తదుపరి సినిమాకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. నితిన్ తర్వాతి సినిమాలో కూడా ఆమెకే హీరోయిన్ గా అవకాశం దక్కింది. లై సినిమా ఆకట్టుకోకపోయినా.. ఆమెకే ఛాన్స్ ఇవ్వడం కొత్త ఊహాగానాలకు కారణం అవుతోంది.

 • పవన్ ట్విటర్ ఫాలోయర్స్.. కొత్త ఫీట్
  Published Date : 12-Sep-2017 6:16:16 IST

  ట్విటర్ లో పవన్ కల్యాణ్ ను అనుసరించే వారి సంఖ్య రెండు మిలియన్లను దాటింది. దాదాపు ఇరవై లక్షల మంది నెటిజన్లు ట్విటర్ లో పవన్ కల్యాణ్ అకౌంట్ ను ఫాలో అవుతున్నారు. తెలుగు సెలబ్రిటీల్లో ఇది అరుదైన ఫీటే అని చెప్పాలి. దక్షిణాది సినిమా వాళ్లలో చాలా మంది ఫాలోయర్ల సంఖ్య రెండు మిలియన్లను దాటింది. అయితే తెలుగు వారికి మాత్రం ఇది అరుదైన ఫీటే. పవన్ సినిమా హీరోగానే కాకుండా రాజకీయ పార్టీ నేతగా కూడా ఉండటంతో ఫాలోయర్ల సంఖ్య మరింత పెరిగింది.

 • కెరీర్ లో టఫ్ టైమ్ అదే: సచిన్
  Published Date : 12-Sep-2017 6:13:40 IST

  తన 24 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ లో టఫ్ టైమ్ అంటే అది 2007 ప్రపంచకప్ సమయమే అన్నాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఆ ప్రపంచకప్ లో భారత్ శ్రీలంక, బంగ్లాదేశ్ ల చేతుల్లో ఓడి.. లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. తాము దిశానిర్దేశం లేకుండా ఆడామని, ఎందుకు ఆడుతున్నామో కూడా తెలియనట్టుగా ఆడామని సచిన్ అన్నాడు. బెస్ట్ టైమ్ అంటే అది 2011 ప్రపంచకప్ గెలవడమే అని సచిన్ వ్యాఖ్యానించాడు.


 • Widget not in any sidebars
 • తెల్లగా ఉన్నాడని అతడికి పడిపోలేదన్న నటీమణి!
  Published Date : 11-Sep-2017 3:35:06 IST

  తన బాయ్ ఫ్రెండ్ జాతి గురించి ప్రస్తావించే వారిపై మండి పడుతోంది ఇలియానా. ప్రస్తుతం ఒక ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్ తో డేటింగ్ లో ఉంది ఈ గోవా భామ. అతడు ఈమెను తీసే అందమైన ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇలియాన తన పర్సనల్ విషయాల గురించి కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదంటోంది. తెల్లగా ఉంటాడనే, ఒక ఆస్ట్రేలియన్ తో తను ప్రేమలో పడినట్టుగా కామెంట్స్ చేస్తున్న వారి పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

 • జీవితమంతా నటిస్తూనే ఉంటానన్న హీరోయిన్!
  Published Date : 11-Sep-2017 3:33:27 IST

  హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకూ ఏడు సంవత్సరాలు గడిచాయి… అని చెబుతూనే, తను జీవితకాలం అంతా నటిస్తూనే ఉంటానని ప్రకటించింది సోనాక్షి సిన్హా. బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా కూతురు అయిన సోనాక్షీ దబాంగ్ సినిమాతో హీరోయిన్ అయ్యింది. కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలతో కెరీర్ ను కొనసాగిస్తోంది. తను చిరకాలం నటిగా కొనసాగుతాను అని ఏడేళ్లు కాదు మరో డెబ్బై యేళ్లు అయినా నటిస్తానని ఈమె అంటోంది.

 • ‘మహానటి’ సావిత్రిగా కీర్తీ సురేష్ ఇలా…
  Published Date : 11-Sep-2017 3:32:01 IST

  సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో కీర్తీ సురేష్ స్టిల్స్ సోషల్ మీడియాకు ఎక్కాయి. సావిత్రి గెటప్ లో కీర్తీ సురేష్ చక్కగా అమరిందనే కామెంట్లను పొందుతున్నాయి ఈ ఫొటోలు. అయితే మహానటికి సంబంధించిన స్టిల్స్ ఇలా లీక్ కావడం కొత్తేమీ కాదు. ఇది వరకూ కూడా రెండు జడల్లో కీర్తి సురేష్ సావిత్రిలా కనిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది. ఇప్పుడు మరో స్టిల్ లీక్ అయ్యింది. ఈ సినిమా యూనిట్ లోకి షాలినీ పాండే కూడా జాయిన్ అయ్యిందనేది మరో అప్ డేట్.


 • Widget not in any sidebars
 • అన్ని జన్మల్లోనూ అతడే భర్తగా కావాలన్న హీరోయిన్!
  Published Date : 10-Sep-2017 8:11:02 IST

  వంద జన్మలకైనా, వంద ప్రపంచాల్లోనైనా, వంద రూపాల్లోనైనా ఎక్కడున్నా వెతికి పట్టుకొని మళ్లీ మళ్లీ ఆయనే పెళ్లి చేసుకుంటానంటోంది శిల్పా షెట్టి. ఇదంతా తన భర్త రాజ్ కుంద్రా విషయంలో. తాజాగా అతడి పుట్టిన రోజు సందర్భంగా శిల్ప భర్తపై ఈ విధంగా ప్రేమను వ్యక్తీకరించింది. శిల్పా కొన్నేళ్ల కిందట వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. శిల్ప కన్నా అతడు ఏడాది చిన్నవాడు. ఈ జంటకు ఒక బాబు.

 • రేణూదేశాయ్.. తెలుగు రియాలిటీ షో!
  Published Date : 10-Sep-2017 8:08:37 IST

  పవన్ కల్యాణ్ తో విడాకులు అయినా.. రేణూదేశాయ్ మనసు మాత్రం తెలుగు చుట్టూనే తిరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పటికీ తరచూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉండే ఈమె.. తాజాగా ఒక రియాలిటీ షోకు జడ్జిగా నియమితం అయినట్టు సమాచారం. స్టార్ నెట్ వర్క్ తెలుగులో ప్రసారం అయ్యే.. ఒక షోలో రేణూదేశాయ్ పాల్గొంటుందని, బిగ్‌బాస్ ప్రోగ్రామ్ పూర్తి అయిన వెంటనే ఈ షో ప్రారంభం అవుతుందని సమాచారం. మరి టీవీలో రేణూదేశాయ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

 • కూతుర్ని చేర్చడానికి..లండన్ కు జగన్
  Published Date : 10-Sep-2017 8:06:49 IST

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రోజున లండన్ వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ప్రయాణం అయ్యారు. తన పెద్ద కూతురు హర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అడ్మిషన్ సంపాదించడంతో జాయిన్ చేయడానికి జగన్ వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ వర్సిటీలో జగన్ కూతురు సీటు సంపాదించింది. కూతురిని వర్సిటీలో జాయిన్ చేసి పది రోజుల తర్వాత జగన్ లండన్ నుంచి తిరిగి వస్తాడు.


 • Widget not in any sidebars
 • పైసా వసూల్ .. భారీ నష్టాల దిశగా!
  Published Date : 08-Sep-2017 9:33:42 IST

  గతవారం విడుదల అయిన బాలయ్య సినిమా ‘పైసా వసూల్’ డిజాస్టర్ దిశగా సాగుతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాదాపు 33 కోట్ల రూపాయల స్థాయికి థియేటరికల్ రైట్స్ అమ్ముడయిన ఈ సినిమా తొలి వారం ముగిసే సరికి ఇరవై కోట్లు కూడా సాధించలేకపోయిందని సమాచారం. రెండో వారానికి కొత్త సినిమాలు వచ్చి థియేటర్స్ ను ఆక్రమించేశాయి. ఈ నేపథ్యంలో పుంజుకునే అవకాశాలు తక్కువే. ఓవరాల్ గా బాలయ్య 101 ఫైనాన్షియల్ గా బయ్యర్స్‌ను నష్టాల్లో ముంచేస్తోందని తెలుస్తోంది.

 • తెలంగాణలో షాకింగ్ సర్వే రిజల్ట్స్..!
  Published Date : 08-Sep-2017 9:32:04 IST

  తెలంగాణలో రాజకీయ పరిస్థితిపై జరిగినదిగా చెప్పబడుతున్న అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీనే ఈ సర్వే చేయించుకుందనే మాట వినిపిస్తోంది. దీని ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే అధికార తెరాసకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని తేలిందట. తెరాసకు వచ్చే సీట్లు 50 లోపే అని, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని, బీజేపీ కూడా పుంజుకుంటుందని తేలిందట. కొన్ని జిల్లాల్లో తెరాసకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

 • స్టార్ హీ‌రోలపై హీరో భార్య హాట్ కామెంట్స్!
  Published Date : 08-Sep-2017 9:29:10 IST

  వివాహం తర్వాత స్త్రీ ప్రధాన పాత్రల్లోని సినిమాలు చేస్తున్న నటి జ్యోతిక ఒకింత హాట్ కామెంట్స్ చేసింది. ఆడవాళ్ల సమస్యలపై, సమాజంలో ఆడవాళ్ల స్థితి గతులపై సినిమాలు తీస్తే అవి ఆడటం లేదనే విషయంలో జ్యోతిక ఒకింత ఆవేశంగా మాట్లాడింది. ఆడవాళ్ల సెంట్రిక్ సినిమాలకు ఆదరణ దక్కదని ఆమె అభిప్రాయపడింది. స్టార్ హీరో ఎంత చెత్త సినిమాలు తీసినా.. అవి నాలుగైదు రోజులైనా ఆడతాయని, అదే ఆడవాళ్ల సినిమాలు బాగున్నా రెండో వారానికి కానీ పికప్ కావని జ్యోతిక వ్యాఖ్యానించింది.