• రేణూ దేశాయ్.. పవన్ ప్లాఫ్ ను రీమేక్ చేస్తుందట!
  Published Date : 12-Mar-2017 9:19:18 IST

  “జానీ” పవన్ కల్యాణ్ కెరీర్ లోనే ఒక పెద్ద డిజాస్టర్ ఈ సినిమా. పవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా అంత వరకూ పవన్ వరస విజయాల పరంపరకు మంగళం పాడింది. అట్టర్ ప్లాఫ్ అయ్యింది. మరి ఇప్పుడు అదే సినిమాను రీమేక్ చేస్తానని అంటోందట రేణూదేశాయ్. తన సొంత భాష మరాఠీలో సినిమాల నిర్మాతగా మారిన రేణూ జానీ సినిమాను అక్కడ రీమేక్ చేస్తానని అంటోంది. మరి తెలుగులో ప్లాఫ్ కదా.. అంటే, దానిలో మార్పులు చేస్తానని కమర్షియల్ గా తీర్చిదిద్దుతానంటోంది.

 • బాలయ్య- పూరీ సినిమా.. ఆ హాలీవుడ్ సినిమాకు కాపీనా?
  Published Date : 12-Mar-2017 9:17:02 IST

  బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న నూటా ఒకటో సినిమా ఒక హాలీవుడ్ సినిమాకు కాపీనా? పూరీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మూల కథను ఒక హాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందారా అంటే ఔననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా “జాన్ విక్’’ స్ఫూర్తితో పూరీ తెలుగులో బాలయ్యతో సినిమాను రూపొందిస్తున్నాడని.. అంటున్నారు. ఇది వరకూ కూడా పూరీ పలు హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెలుగులో సినిమాలు రూపొందించిన చరిత్ర కలిగిన దర్శకుడు.

 • టీమిండియాకు కుంబ్లే స్థానంలో కొత్త కోచ్?
  Published Date : 12-Mar-2017 9:04:53 IST

  ప్రస్తుతం కుంబ్లే ఆధ్వర్యంలో టీమిండియా బాగా రాణిస్తోందనే చెప్పాలి. వరస విజయాలతో క్రికెట్ టీమ్ దూసుకుపోతోంది. అయితే కోచ్ పదవి నుంచి మాత్రం కుంబ్లేను తప్పించాలని భావిస్తోందట బీసీసీఐ కొత్త పాలక మండలి. కుంబ్లే స్థానంలో రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. మరి కుంబ్లే పరిస్థితి ఏమిటి అంటే.. ఆయనను టీమిండియా డైరెక్టర్ గా నియమించి, మహిళ జట్టు, పురుషుల జట్టు, జూనియర్స్ జట్టు బాద్యతల సమీక్షకుడిని చేయనున్నారట.

 • ఐదు రాష్ట్రాల్లో రెండు చోట్ల బీజేపీ హవా
  Published Date : 11-Mar-2017 12:05:54 IST

  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తోంది. అయితే పంజాబ్, గోవా, మణిపూర్ లలో మాత్రం బీజేపీకి అంత సానుకూల ఫలితాలు లేవు. పంజాబ్ లో కాంగ్రెస్ విజయబావుటా ఎగరేసింది. గోవాలో కూడా కాంగ్రెస్ పై చేయి సాధిస్తోంది. మణిపూర్ లో కాంగ్రెస్- బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది.

 • అఖిల్- విక్రమ్ కుమార్ టైటిల్ అదేనా?
  Published Date : 10-Mar-2017 10:47:46 IST

  ‘రా రండోయ్ వేడుక చూద్దాం..’ ఇదీ అన్నపూర్ణ ఆర్ట్స్ బ్యానర్ పై నాగార్జున రిజిస్టర్ చేయించిన టైటిల్. ఆసక్తికరంగా ఉన్న ఈ టైటిల్ అఖిల్ సినిమా కోసం అనే మాట వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. విభిన్నమైన టైటిల్స్ తో రావడం విక్రమ్ కుమార్ ప్రత్యేకత. అదే సమయంలో టైటిల్ కు కథకు చాలా రిలేషన్ ఉంటుంది. ఈ నేఫథ్యంలో ఈ టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 • మణిరత్నం సినిమా.. ఇది అదేనా?
  Published Date : 09-Mar-2017 10:52:02 IST

  ఒక మల్టీస్టారర్ సబ్జెక్టు కోసం నటీనటుల వేటను చాన్నాళ్లుగానే కొనసాగిస్తున్నాడు మణిరత్నం. మహేశ్ బాబు- నాగార్జున కాంబోలో సదరు కాన్సెప్టు తెరకెక్కుతుందని కొన్నాళ్ల కిందట ప్రకటన చేశారు. అయితే సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఆ సినిమా విషయంలో చాలా మంది హీరోల పేర్లే వినిపించాయి. మమ్ముట్టీ, కార్తీ అని, కార్తీ- దుల్కర్ సల్మాన్ అని.. ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఆ సినిమా విషయంలో విజయ్- విక్రమ్ ల పేర్లు వినిపిస్తున్నాయి.

 • అలా ఎందుకు చేయకూడదంటున్న సమంత!
  Published Date : 09-Mar-2017 10:51:12 IST

  పెళ్లి తర్వాత సినిమాలు చేస్తారా? అనే ప్రశ్న పట్ల ఒకింత ఘాటుగానే స్పందించింది సమంత. నాగ చైతన్య తో ఎంగేజ్ మెంట్ నుపూర్తి చేసుకున్న సమంత.. తను పెళ్లి తర్వాత నటిస్తానని స్పష్టం చేసింది. ఈ విషయంలో రెండో ఆలోచన లేదనేసింది. అన్ని రంగాల్లోనూ మహిళలు పెళ్లి తర్వాత కూడా కొనసాగుతారని.. అలాంటప్పుడు నటన విషయంలో మాత్రం ఎందుకు పెళ్లిని విభజన రేఖగా చూస్తారు? అని సమంత ప్రశ్నిస్తోంది. త్వరలోనే ఈ భామ చైతూతో పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

 • బాలయ్య- పూరీ కాన్సెప్ట్ అదే..?
  Published Date : 09-Mar-2017 10:50:13 IST

  దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద చాలా కాన్సెప్టులే పెండింగ్ ఉన్నాయి. మెగాస్టార్ కు పూరీ నెరేట్ చేసిన ఆటోజానీ కథ, మహేశ్ బాబుతో చేస్తానని ప్రకటించిన జనగణమన .. వంటి సినిమాలు పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో పూరీ బాలయ్యతో సినిమా చేయబోతున్నాడు. మరి దీని కాన్సెప్ట్ ఏమిటి.. అని ఆరాతీస్తే, మహేశ్ బాబుతో తీస్తానని ఈ దర్శకుడు అనౌన్స్ చేసిన జనగణమన కాన్సెప్టే బాలయ్యతో తీయబోతున్నాడని తెలుస్తోంది. బాలకృష్ణ కు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చిందని దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.

 • ఎట్టకేలకూ మహేశ్ సినిమా టైటిల్ ఖరారు?
  Published Date : 09-Mar-2017 10:49:12 IST

  మురగదాస్ తో సినిమా చేయబోతున్నట్టుగా మహేశ్ బాబు నుంచి అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి దాని టైటిల్ విషయంలో రకరకాల మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంత వరకూ అధికారికంగా టైటిల్ ఖరారు కాలేదు. అయితే తాజాగా ఈసినిమా విషయంలో ‘అభిమన్యు’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇది దాదాపు ఖరారు అయినట్టేనని తెలుస్తోంది. సంభవామి అనే టైటిల్ ను పరిశీలించినప్పటికి అభిమన్యు అనే టైటిల్ సరిపోతుందని ఫిక్సయ్యారట దీని రూపకర్తలు. త్వరలోనే ఫస్ట్ లుక్, రంజాన్ కు విడుదల అని సమాచారం.

 • తాగుడు బిల్లుపై యువ హీరోలకు స్టార్ హీరో సలహా!
  Published Date : 08-Mar-2017 7:39:26 IST

  సినిమా మేకింగ్ దశలో తమ మొత్తం భారాన్ని సదరు సినిమా నిర్మాతపై మోపే హీరోల తీరును తప్పుపట్టాడు సీనియర్ హీరో అక్షయ్ కుమార్. ప్రత్యేకించి తాగుడు కు సంబంధించిన బిల్లులను నిర్మాతలపై మోప వద్దని అక్షయ్ కుమార్ సలహా ఇచ్చాడు. ఆ భారాన్ని ఎవరకు వారు భరించుకోవాలన్నాడు. నిర్మాతలకు అదనపు భారాన్ని మోపొద్దన్నాడు. చాలా హుందాగా ప్రవర్తించే హీరోగా పేరుంది అక్షయ్ కుమార్ కు. ప్రస్తుతం ఇతడి సినిమా జాలీ ఎల్ఎల్ బీ రెండొందల కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటింది.

 • ఇండియా క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా…!
  Published Date : 08-Mar-2017 7:38:22 IST

  ఇది వరకూ కూడా టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్ లో తొలి స్థానాన్ని సాధించింది. ఐసీసీ ప్రకటించే ర్యాంకుల జాబితాలో నంబర్ వన్ గా నిలిచింది. అయితే.. ప్రతియేటా ఏప్రిల్ ఒకటి నాటికి ర్యాకింగ్స్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న జట్టుకు ఐసీసీ అందించే భారీ ప్రైజ్ మనీని మనోళ్లు ఎప్పుడూ సాధించలేదు. ఇప్పుడు ఆ మొత్తాన్ని వన్ మిలియన్ డాలర్లకు పెంచారు. ప్రస్తుతం టీమిండియా నంబర్ వన్ గా ఉంది. ఈ జట్టుకు ఆ మొత్తం దక్కుతుందని ఐసీసీ ట్వీట్ చేసింది.

 • భారీ డీల్… టీమిండియాకు కొత్త స్పాన్సర్..!
  Published Date : 08-Mar-2017 7:37:23 IST

  ప్రస్తుతం క్రికెట్ టీమిండియాకు అఫిషియల్ స్పాన్సర్ గా వ్యవహరించిన స్టార్ నెట్ వర్క్ ఆ ఒప్పందాన్ని ముగించుకోవడంతో.. బీసీసీఐ నిర్వహించిన వేలంలో కొత్త స్పాన్సర్ ముందుకు వచ్చింది. భారీ డీల్ తో టీమిండియాకు అఫిషియల్ స్పాన్సర్ గా మారింది “ఒప్పో’’. ఈ మొబైల్స్ తయారీ సంస్థ ఏకంగా ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల భారీ డీల్ తో స్పాన్సర్షిప్ ను సంపాదించుకుంది. ఈ ఒప్పందం విలువ ఐదు సంవత్సరాలు. త్వరలోనే ఒప్పో టీమిండియాకు తన లోగోతో కొత్త జెర్సీలను విడుదల చేయనుంది.

 • ఆ సినిమాపై 36 కోట్లు పెడితే పది రాలేదా!
  Published Date : 07-Mar-2017 9:52:03 IST

  ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఓం నమో వేంకటేశాయ సినిమా భారీ డిజాస్టర్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమా భారీ నష్టాలను మూటగట్టుకుందని సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగగా… లాభాల సంగతి అలా ఉంచి, కనీసం నాలుగో వంతు మొత్తం కూడా రిటర్న్ కాలేదనిటాక్. ఈ సినిమాను మొత్తం ముప్పై ఆరు కోట్ల రూపాయలకు అమ్మారని, మొత్తం వసూళ్లు ఎనిమిది కోట్ల రూపాయల చిల్లర అని.. దీంతో డిస్ట్రిబ్యూటర్లు మూడు వంతు మొత్తాన్ని నష్టపోయారని ట్రేడ్ పండితులంటున్నారు.

 • హాట్ హీరోయిన్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ!
  Published Date : 07-Mar-2017 9:50:59 IST

  వాణీ విశ్వనాథ్ ఒకనాడు టాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా వెలుగొందింది. ఎక్కువగా మలయాళీ చిత్రాల్లో నటించిన వాణీ పలు తెలుగుసినిమాల్లో నటించింది. చిరంజీవితో ఘరానామొగుడు సినిమాలో ఒక కీలక పాత్ర చేసింది. మోహన్ బాబు వంటి హీరోల సరసన నటించింది. కొన్ని ప్రత్యేక గీతాల్లో కూడా కనిపించింది. మలయాళం నుంచి అనువాదం అయిన పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసింది వాణీ. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఈమె రీ ఎంట్రీ ఇస్తోందట. బెల్లంకొండ సాయి హీరోగా నటిస్తున్న సినిమాలో ఈమె కనిపించనుందట.

 • చిరంజీవా..అలాంటిదేమీ లేదన్న రాజమౌళి!
  Published Date : 07-Mar-2017 9:48:10 IST

  బాహుబలి ద్వితీయార్ధానికి సంబంధించిన సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడనే ప్రచారాన్ని ఖండించాడు దర్శకుడు రాజమౌళి. ట్విటర్ ద్వారా ఆయన వివరణ ఇచ్చాడు. బాహుబలి పార్ట్ టూకు చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు.. అని ఆయన ట్వీట్ చేశాడు. తద్వారా ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేయత్నం చేశాడు. ఇటీవలే విడుదల అయిన గుంటూరోడు సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దీంతో బహుబలి పార్ట్ టూ విషయంలో అలాంటి ప్రచారం మొదలైంది.