• మద్యపానం తో ఏడు రకాల క్యాన్సర్లు!
  Published Date : 22-Jul-2016 5:04:09 IST

  మద్యపానం హానికరం అనేది పదే పదే వినిపించే మాట. అతిగా మద్యం సేవించడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు, గుండెపోటు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇది వరకూ అనేక అధ్యయనాలు తెలిపాఆయి. మద్యంతో వచ్చే క్యాన్సర్ల గురించి వివరించిందొక అధ్యయనం. దీని ప్రకారం ఆల్కాహాల్ ప్రభావంతో శరీరంలో ఏడు రకాల అవయవాలు ప్రభావితం అవుతాయని, వీటన్నింటిపైనా మద్యం ప్రభావం చూపిస్తుందని, మద్యపానం వల్ల ఈ అవయావాలకు క్యాన్సర్ సోకే అవకాశం ఉందని అధ్యయకర్తలు పేర్కొన్నారు. క్యాన్సర్ మరణాల్లో 5.8 శాతం మద్యం వల్ల సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.

  full article @ Timesofindia
 • కోటీశ్వరుడి కొడుకు.. నెల రోజుల సాధారణ జీవితం!
  Published Date : 22-Jul-2016 4:53:13 IST

  ఆయన వజ్రాల వ్యాపారి. కోటీశ్వరుడు. వారసుడికి జీవితం అంటే ఏమిటో అర్థం కావాలని భావించాడు. నెల రోజుల పాటు సాధారణమైన వాడిగా బతకమని చెప్పాడు. ఏడు వేల రూపాయల డబ్బులిచ్చి పంపాడు. తనయుడికి కనీసం ఫోన్ కూడా ఇవ్వకుండా పంపించాడు. ఈ నెల రోజుల్లో తనయుడు చాలా కష్టాలే పడ్డాడు. తొలి ఐదు రోజుల్లో అరవై చోట్లకు వెళ్లినా ఉద్యోగం దొరకలేదట. చివరకు ఏవో చిరుద్యోగాలు చేసుకొంటూ రూ.40తో బోజనం చేస్తూ మొత్తంగా నాలుగువేలు మిగిల్చి తండ్రి పెట్టిన పరీక్ష నెగ్గాడట ఆ తనయుడు.

  full article @ Sakshi
 • ఇండియన్స్ కు ఇష్టమైన షాపింగ్ యాప్ ఇదే!
  Published Date : 22-Jul-2016 4:43:18 IST

  భారతదేశంలో అత్యంత ఎక్కువగా వినియోగంలో ఉన్న ఇ-షాపింగ్ యాప్ గా అమెజాన్ నిలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ ను దాటేసి తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ అప్లికేషన్. స్మార్ట్ ఫోన్ల విషయంలో అమెజాన్ 1.92 మిలియన్ల డౌన్ లోడ్స్ తో తొలి స్థానంలో ఉందని, ఫ్లిప్ కార్ట్ 1.72 మిలియన్ల డౌన్ లోడ్స్ తో ఆ తర్వాతి స్థానంలో ఉందని ఒక అధ్యయనం తేల్చింది. మిగతా షాపింగ్ యాప్సేవీ వీటికి పోటీ ఇచ్చే దశలో లేవు. డెస్క్ టాప్ ట్రాఫిక్ విషయంలో కూడా అమెజాన్ తొలిస్థానంలో, ఫ్లిప్ కార్ట్ ద్వితీయస్థానంలో ఉంది.

  full article @ scoopwhoop

 • Widget not in any sidebars
 • ‘కబాలి’ ఎలా ఉంది..?
  Published Date : 22-Jul-2016 4:32:40 IST

  క్రేజ్ కు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ విడుదలైన రజనీకాంత్ సినిమాపై పెదవి విరుపులే ఎదురవుతున్నాయి. ఈ సినిమా అంతగా ఆకట్టుకోవడం లేదని అంటున్నారు రివ్యూయర్లు. మంచి నేపథ్యాన్నే తీసుకున్నా స్లో నెరేషన్, పంచ్ డైలాగులు లేకపోవడం, మితిమీరిన హింస, కన్ఫ్యూజన్ తో సినిమా ఆకట్టుకోదని వారు పేర్కొన్నారు. సినిమాకు ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది రజనీకాంత్ మాత్రమే, రజనీ గెటప్ , స్ట్రైల్స్ విషయంలో మంచి మార్కులే పడినా.. కథనం సినిమాకు పెద్ద లోటు అని విశ్లేషకులు అంటున్నారు. కబాలి అంచనాలను అందుకోలేకపోయాడంటున్నారు.

  full article @ Greatandhra
 • చంద్రబాబు జీవిత సినిమా.. ఎన్టీఆర్ కు స్థానముందా?
  Published Date : 22-Jul-2016 1:45:01 IST

  తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆయన అభిమాని, తెలుగుదేశం నేత ఒకరు ఈ సినిమాను తెరకెక్కించున్నారట. దీనికి టైటిల్ కూడా ఫిక్సయ్యింది. ‘చంద్రోదయం’ పేరుతో ఈ సినిమాను రూపొందించనున్నారట. మరి బాబు జీవితంపై సినిమా అంటే సహజంగానే కొన్ని సందేహాలు వస్తాయి. అందులో అన్ని అంశాల ప్రస్తావనా ఉంటుందా? ప్రత్యేకించి.. బాబు ఎన్టీఆర్ ను గద్దెదించి తను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అంశాన్ని సదరు బయోపిక్ లో ప్రస్తావిస్తారా?లేదా? అనేవి ఆసక్తికరమైన అంశాలే!

  full article @ Greatandrha

 • ట్రాఫిక్ జామ్ అయ్యిందని రోడ్లోనే రొమాన్స్ స్టార్ట్ చేశారు!
  Published Date : 22-Jul-2016 1:43:56 IST

  మహా నగరాల్లో ట్రాఫిక్ జామ్ గురించి వివరించనక్కర్లేదు. గమ్యానికి ఎప్పుడు చేరతామో చెప్పలేని పరిస్థితి. నగర జనాలు ఈ ట్రాఫిక్ కష్టాలతో తీవ్రమైన ఇబ్బందులే పడుతుంటారు. ఇలాంటి జామ్ తో ఇబ్బంది పడటం ఎందుకు? అనుకున్నారేమో ఆ జంట నడిరోడ్డు మీదే రొమాన్స్ స్టార్ట్ చేశారు. బైక్ పై ప్రయాణిస్తున్న ఆ జంట ఎంతకూ గ్రీన్ సిగ్నల్ పడకపోవడంతో అక్కడే ముద్దూముచ్చట్లు ప్రారంభించారు. అక్కడే ఎవరో ఉత్సాహవంతులు ఈ రొమాన్స్ ను వీడియోగా చిత్రీకరించి ఆన్ లైన్ లోకి అప్లోడ్ చేశారు. దీనికి వ్యూసే వ్యూస్!

  full article @ Youtube

 • Widget not in any sidebars
 • విరాట్ కొహ్లీ సరికొత్త ఫీట్!
  Published Date : 22-Jul-2016 8:19:06 IST

  కొహ్లీ సరికొత్త ఫీట్ సాధించాడు. టెస్టు కెరీర్ లో మూడు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. తాజాగా వెస్టీండీస్ తో తొలి టెస్టు మ్యాచ్ లో తానాడిన 73వ ఇన్నింగ్స్ తో విరాట్ ఈ మార్కుకు చేరుకున్నాడు. ఇది వరకూ అనేక మంది భారత ఆటగాళ్లు ఈ ఫీట్ సాధించారు. సెహ్వాగ్ 55 ఇన్నింగ్స్ లలోనే ఈ మార్కును చేరుకున్నాడు. అజర్ 64 ఇన్నింగ్స్ లో, గవాస్కర్, అజర్ లు 66 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ ను సాధించారు. సచిన్, ద్రావిడ్ లు 67 ఇన్నింగ్స్ లలో ఈ మార్కును చేరారు.

  full article @ News18
 • చైనా సరిహద్దులో భారత్ దూకుడు!
  Published Date : 22-Jul-2016 8:09:07 IST

  ఇండో-చైనా సరిహద్దు ఒకింత ఉద్రిక్తంగా మారింది. చైనాతో సరిహద్దు ప్రాంతంలో భారత్ తన యుద్ధ నౌకలను మోహరించింది. చరిత్రలో ఎన్నడూలేనంత స్థాయిలో అక్కడకు ఏకంగా వంద ట్యాంకులను తరలించింది భారత సైన్యం. 1962లో చైనా యుద్ధ సమయంలో ఇండియా చివరిసారి ఇక్కడ ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. మళ్లీ ఇప్పుడు ఈ ట్యాంకులతో పరిస్థితులను ఒకింత ఉద్రిక్తంగా మార్చింది. చైనా దూకుడును తగ్గించడానికే ఇండియా ఈ ట్యాంకులు తరలించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త్వరలో మరిన్ని ట్యాంకర్లలను తరలించనున్నారు. శాంతిపరిరక్షణ ఒప్పందాలను గౌరవించాలని చైనా వ్యాఖ్యానించింది.

  full article @ Enadu
 • స్టార్ హీరో.. కబాలి సినిమావి 250 టికెట్లు కొన్నాడు!
  Published Date : 22-Jul-2016 7:59:24 IST

  కబాలి మాస్ మానియా అనేక రకాలుగా వార్తల్లోకి వస్తోంది. కబాలి సినిమా టికెట్లను సాధిస్తే.. ప్రపంచాన్ని జయించినట్టుగా ఫీలవుతున్నారు రజనీ అభిమానులు. ఇక మరికొందరు ఈ సినిమా టికెట్ల కోసం ఏకంగా మంత్రుల సిఫార్సులు ఉపయోగించుకుంటున్నారు. ఈ మానియాలో భాగమయ్యాడు తమిళ స్టార్ హీరో శింబు. రజనీకాంత్ కు పెద్ద ఫ్యాన్ అయిన ఈ హీరో ఏకంగా మూడువందల టికెట్లు కొనుగోలు చేశాడు. కబాలి విడుదల రోజున ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న తన సినిమా యూనిట్ అందరితో కలిసి చూడటానికి ఈ టికెట్లు కొనుగోలు చేశారు.

  full article @ Sakshi

 • Widget not in any sidebars
 • ప్రధానమంత్రే ఈమెకు లైనేశాడట!
  Published Date : 21-Jul-2016 5:46:00 IST

  పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తనకు లైనేశాడని అంటోంది ఆ దేశానికే చెందిన మోడల్ అస్మా రాజ్ పుత్. విమాన ప్రయాణంలో ఈ వ్యవహారం నడిచిందని ఆమె చెప్పింది. కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు ప్రయాణిస్తుండగా షరీఫ్ చూపు తన మీద పడిందని, తన గురించి ఆయన వాకబు చేశాడని చెప్పింది. ఎక్కడుంటావు.. ఏం చేస్తుంటావు..అనే విషయాలను విచారించిన షరీఫ్ ఆయన ఎక్కడుంటాడో కూడా చెప్పి తనను డిన్నర్ కు రమ్మన్నాడని వివరించింది. దీనికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పి..వాటిని బయటపెట్టనంటోంది!

 • ఫేస్ బుక్ ట్రెండింగ్స్ లో రాహుల్ టాప్..!
  Published Date : 21-Jul-2016 5:41:00 IST

  అధికారంలో లేని వాళ్లను ఎవరూ అంతగా పట్టించుకోరు. వారు మరీ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తుంటే తప్ప వారి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడరు. మరి ఇలా కాదు కానీ, కాంగ్రెస్ యువరాజు రాహుల్ మరో విధంగా అందరి దృష్టినీ తన వైపుకు లాగుతున్నాడు. ఫేస్ బుక్ ట్రెండింగ్స్ లో టాప్ లో ఉన్నాడు. ఒకవైపు సభలో వాడీవేడీ చర్చజరుగుతుండగా రాహుల్ కునుకు తీయడం కామెడీగా మారింది. రాహుల్ తీరుపై ఆయన వైరి పక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ వాళ్లు డ్యామేజీ కవరేజ్ చేసుకుంటున్నారు. నెటిజన్లేమో జోకులేసుకుంటున్నారు.

  full article @ Facebook

 • కాజల్.. స్పైసీ ఫొటో గ్యాలరీ
  Published Date : 21-Jul-2016 5:38:51 IST

  ఒకవైపు వరసగా ప్లాఫులున్నా కాజల్ ఊపు మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ లో పదేళ్ల కాలాన్ని పూర్తి చేసిన ఈ భామ ఇప్పటికీ స్టార్ హీరోల సరసన అవకాశాలను సంపాదించుకుంటోంది. ఇటీవల మహేశ్, పవన్ ల సినిమాల్లో హీరోయిన్ గా నటించినా అవంత హిట్ కాలేదు. అయితే ఇప్పుడు అంతకు మించిన స్థాయి క్రేజున్న సినిమా చిరంజీవి రీ ఎంట్రీ పిక్చర్ లో హీరోయిన్ గా అవకాశాన్ని సంపాదించిందట కాజల్. ఇది నిజంగానే గోల్డన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇలా దూసుకుపోతున్న కాజల్ స్పైసీ ఫొటో గ్యాలరీ…

  full article @ Eenadu

 • Widget not in any sidebars
 • ‘కబాలి’ మేకింగ్ వీడియో.. ట్రెండింగ్స్ లో టాప్!
  Published Date : 21-Jul-2016 12:33:28 IST

  మరికొన్ని గంటల్లో విడుదల కానున్న రజనీకాంత్ ‘కబాలి’కి ఉన్న క్రేజేమిటో వేరే వివరించనక్కర్లేదు. మీడియాలో ఎటువైపు చూసినా ఆ సినిమా హడావుడే కనిపిస్తోంది. మీడియాలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ కబాలినే ఛాంపియన్ గా కొనసాగుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ‘కబాలి’ మేకింగ్ వీడియో యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఒక నిమిషం వ్యవధితో ఉండే ఈ వీడియో యూట్యూబ్ ఇండియన్ ట్రెండింగ్స్ లో టాప్ పొజిషన్లో ఉంది ఈ వీడియో. దాదాపు పదిలక్షల వ్యూస్ తో ఇది దూసుకపోతోంది. ‘కబాలి’ సినిమా చిత్రీకరణను తీరును ఈ వీడియోలో పెట్టారు.

 • సుస్మితా సేన్ క్యాట్ వాక్ చేస్తుంటే కట్టు జారింది!
  Published Date : 21-Jul-2016 12:28:02 IST

  మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్ ఒక ఫ్యాషన్ షోలో ఇబ్బందికరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. మోడ్రన్ దుస్తుల్లో క్యాట్ వాక్ చేస్తున్న ఆమె కు ఆ వస్త్రాలే ఇబ్బందిని కలిగించాయి. ఆమె కాళ్లకు డ్రస్ అడ్డం పడింది. దాన్ని తొలగించడానికని వంగడానికి ప్రయత్నించి సుస్మిత మరింత ఇబ్బందిగా ఫీలయ్యింది. ముందువైపుకు వంగడానికి ఇబ్బంది పడి, పక్కనే ఉన్న ఒక మహిళ సాయంతో కాళ్లకు అడ్డం పడిన డ్రస్ ను తప్పించి.. క్యాట్ వాక్ ను కొనసాగించింది. ఆ సాయం చేసిన మహిళను గుండెకు హత్తుకుంది సుస్మిత.

 • ఆమ్ ఆద్మీకి సిద్దూ పెట్టిన మూడు కండీషన్లు ఇవే!
  Published Date : 21-Jul-2016 12:14:55 IST

  బీజేపీకీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్ధూ ఆప్ లో చేరనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఆయన మూడు కండీషన్లను పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకటి.. పంజాబ్ సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలి, రెండోది వచ్చే ఏడాది జరగనున్న ఈ ఎన్నికల ప్రచారంలో సర్వాధికారం తనకే ఉండాలి, ఈ విషయంలో ఢిల్లీ జోక్యం ఉండకూడదు. మూడోది.. ఒకవేళ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోతే తనను రాజ్యసభకు నామినేట్ చేయాలి. ఈ మూడు కండీషన్లకు ఓకే అంటేనే తను ఆప్ చేరతానంటున్నాడట ఈ మాజీ క్రికెటర్.

  full article @ Catchnews