• బాబు తో పాటు పుష్కరస్నానానికి జనాల వెనుకంజ!
  Published Date : 23-Jul-2016 8:35:35 IST

  గోదావరి పుష్కర దుర్ఘటన నేపథ్యంలో కృష్ణా పుష్కరాల విషయంలో ప్రజలు తమ జాగ్రత్తలో తామున్నారట! వీఐపీల హడావుడి ఎక్కువగా ఉండే వేళ పుష్కర ఘాట్ కు వెళితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. అని భయపడుతున్నట్టుగా తెలుస్తోంది. రద్దీ సమయాల్లో పుష్కరఘాట్లకు దూరంగా ఉండటం మంచిదని వారు భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి కృష్ణా పుష్కరాలకు అతిపెద్ద వీఐపీ అయిన ఏపీ సీఎం చంద్రబాబు తొలిరోజు పుష్కరస్నానం చేసే అవకాశం ఉండటంతో ఆ రోజున ఘాట్స్ కు దూరంగా ఉండటం మేలనేది జనాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.

  full article @ Greatandhra
 • విడాకుల భరణం.. 660 కోట్ల రూపాయలు!
  Published Date : 23-Jul-2016 8:31:27 IST

  భార్య నుంచి విడాకులు తీసుకున్న జుఫాలి అనే ఒక సౌదీ కోటీశ్వరుడు భారీ స్థాయి భరణమిచ్చాడు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం తీసుకున్న విడాకుల డీల్ సెటిల్ మెంట్ విషయంలో ఈ భరణం ఒక రికార్డులాంటిదే! మూడేళ్ల పాటు న్యాయపోరాటం చేసి ఏకంగా 660 కోట్ల రూపాయల భరణాన్ని సాధించుకుంది జుఫాలి భార్య. విషాదం ఏమిటంటే..ఈ భరణం ఒప్పందం మేరకు భార్యతో విడిపోయిన ఆయన వ్యవహారం సెటిల్ కాకముందే మరణించాడు. విడాకుల అనంతరం 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ 61 యేళ్ల కోటీశ్వరుడు భావించాడు. అయితే ఇంతలోనే మరణించాడతను.

  full article @ Sakshi
 • 39 మంది భార్యలు, 89 మంది సంతానం!
  Published Date : 23-Jul-2016 8:28:18 IST

  39 మంది భార్యలు, 89 మంది సంతానం.. దశాబ్దాల సంసారం, కూతుళ్లు, కొడుకులు.. మనవళ్లు, మనవళ్లతో కలిసి మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్యయ 181 మంది! వీళ్లంతా ఉండేది ఒక అపార్ట్ మెంట్ లోనే! మిజోరంకు చెందిన జియోనాచానా అనే వ్యక్తి కుటుంబం ఇదంతా. 15 ఏళ్ల వయసు నుంచే చానా పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టాడు. చివరసారిగా 39వ భార్యను 2004లో పెళ్లి చేసుకున్నాడితను. ఇంతమంది భార్యలు, పిల్లలు కుటుంబంతో ఇతడు సంసారం సాగించడం ఒక వింత అయితే ఈ ఉమ్మడి కుటుంబం ఒకే ఇంట్లో సహజీవనం చేస్తుండటం మరో వింత!

  full article @ Eenadu

 • Widget not in any sidebars
 • పునరుజ్జీవనానికి కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రోగ్రామ్!
  Published Date : 23-Jul-2016 12:59:00 IST

  లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ కోలుకోలేదు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడం, కేంద్రంలో మోడీ సర్కారును ఇరుకునపెట్టలేకపోవడం ఈ పార్టీ బలహీనతలుగా మారాయి. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది కాంగ్రెస్. ఈ ప్రయత్నాల్లో భాగంగా తాజాగా షీలా దీక్షిత్ ఆధర్వ్యంలో ఒక బస్సు యాత్ర ప్రారంభం అయ్యింది. ఆరువందల కిలోమీటర్ల దూరం సాగే ఈ యాత్రకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ పచ్చజెండా ఊపి ప్రారంభించాడు.

  full article @ Dna
 • ఫ్లంట్ మ్యాగ్జిన్ కవర్ పై ప్రియాంక హాట్ పోజు!
  Published Date : 23-Jul-2016 12:55:22 IST

  బాలీవుడ్ వరకే కాకుండా.. తన ఖ్యాతిని హాలీవుడ్ వరకూ పెంపొందించుకుంది ప్రియాంక చోప్రా. ఈ మాజీ మిస్ వరల్డ్ ఇప్పుడు హాలీవుడ్ సినిమాల అవకాశాలతో బిజీగా ఉంది. కోరివచ్చిన హిందీ సినిమా అవకాశాలను కూడా కాదనుకునేంత స్థాయికి చేరింది. మిస్ వరల్డ్ గా ఎప్పుడో మాజీ అయినా.. ప్రియాంక వన్నె మాత్రం ఎన్నటికీ తరగనిదే. అందుకు తాజా రుజువు ఫ్లంట్ మ్యాగ్జిన్ కవర్ కోసం ప్రియాంక ఇచ్చిన పోజు.అభిమానులకు గిఫ్ట్ ను ఇస్తున్నట్టుగా పోజు ఇచ్చింది ప్రియాంక. మిస్ వరల్డ్ అందాలెలా ఉంటాయో చూపింది!

 • రజనీకాంత్ ‘కబాలి’ వెర్షన్ జోకులు!
  Published Date : 23-Jul-2016 12:50:13 IST

  రజనీకాంత్ శక్తి సామార్థ్యాల గురించి ఆయనకు ఉన్న మానియా గురించి జోకులు కొత్తేమీ కాదు. రజనీని ఒక అనితర సాధ్యుడిగా, అసామాన్యుడిగా, సూపర్ మాన్ అన్నట్టుగా అభివర్ణిస్తూ అనేక జోకులు ప్రచారంలో ఉన్నాయి. ఫేస్ బుక్ లో అయితే రజనీ పై జోకులతో కొన్ని పేజ్ లే నడుస్తున్నాయి! ఇలాంటి జోకుల్లో ‘కబాలి’ నేపథ్యంలో అప్ డేటెట్ వెర్షన్లు వచ్చాయి. నెటిజన్లు రజనీని ఒక రేంజ్ లో గౌరవిస్తూనే ఈ జోకులను పోస్టు చేశారు. కబాలి విడుదలపై ఉన్న మాస్ మానియాను ప్రస్తావిస్తూ జోకులు సాగాయి.

  full article @ Indianexpress

 • Widget not in any sidebars
 • అమెరికా పై యుద్ధానికి చైనా సై!
  Published Date : 23-Jul-2016 9:42:24 IST

  దక్షిణ చైనా సముద్రంపై హక్కులన్నీ తనవే అని చైనా స్పష్టం చేస్తోంది. ఆ సముద్రపు సరిహద్దు దేశాలకు అనుకూలంగా అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు చెల్లబోవని చైనా అంటోంది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును తాము గౌరవించము అని, ఈ విషయంలో ఎవరైనా ఒత్తిడి చేసినా, ఆ తీర్పును అమలు చేయడానికి వచ్చినా యుద్ధానికి సై అని అంటూ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది చైనా ప్రభుత్వం. యుద్ధానికి సిద్ధంగా ఉండమని తమ సైన్యాన్ని ఆదేశించి చైనా ఉద్రిక్తతను పెంచుతోంది. క్షిపణులను చైనా సిద్ధం చేస్తోంది.

  full article @ Andhrabhoomi
 • వేల ఏళ్ల కిందటి సబ్జెక్ట్.. హృతిక్ డాన్స్ ఇరగదీశాడు!
  Published Date : 23-Jul-2016 9:36:29 IST

  మానవ నాగరికతలో అత్యంత పూర్వమైన, వేల ఏళ్ల కిందటే అత్యంత అభివృద్ధి చెందిన నాగరికతగా పేరు ‘మొహంజదారో’ నాగరికతకు. అందుకు సంబంధించిన శిలాశాసనాలు ఎన్నో లభించాయప్పటికే. ఇప్పుడు బాలీవుడ్ లో ఆ నాగరికత కథాంశంతో ఒక సినిమా రెడీ అవుతోంది. అదే ‘మొహంజదారో’. హృతిక్ రోషన్, పూజా హెగ్డేలు హీరోహీరోయిన్లు గా నటించిన, అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కు సంబంధించి టైటిల్ సాంగ్ తాజాగా విడుదల అయ్యింది. రెహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా టైటిల్ సాంగ్ హృతిక్ డాన్స్ అదిరిపోయింది.

  full article @ Youtube

 • సినిమా వాళ్లు పట్టించుకోవడం లేదన్న సీనియర్ నటుడు
  Published Date : 23-Jul-2016 9:33:20 IST

  కైకాల సత్యనారాయణ.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం అవసరం లేని నటుడు. విలన్ పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయనది దశాబ్దాల ప్రస్థానం. ఎన్టీఆర్ , ఏఎన్నార్ వంటి లెజెండరీ హీరోలకు విలన్ గా చేసిన లెజెండరీ స్థాయి నటుడు సత్యనారాయణ. తెలుగు ఆవాళ కూడా సత్యనారాయణకు మంచి గుర్తింపు ఉంది. సుభాష్ ఘయ్ హిందీ సినిమాలో ఏరికోరి ఈయనను విలన్ గా పెట్టుకున్నాడు. ఎస్వీఆర్ కు సమానుడు అనే పేరు తెచ్చుకున్న సత్యనారాయణ ఇప్పుడు పరిశ్రమ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు.

  full article @ Sakshi

 • Widget not in any sidebars
 • ‘కబాలి’ చూసొచ్చిన జనాలేమంటున్నారంటే…
  Published Date : 22-Jul-2016 5:17:01 IST

  ఎంతో ఆత్రుతగా రజనీ సినిమా కోసం ఎదురుచూసి.. భారీ ధర చెల్లించి, టికెట్ల కోసం తోపులాటలను ఎదుర్కొని మరీ ‘కబాలి’ ని చూసొచ్చిన ప్రేక్షకులు ఏమంటున్నారు? భారీ అంచనాలతో సినిమాకు వెళ్లిన వారికి ఎలాంటి అనుభూతి మిగిలిందంటే.. యావరేజ్ అంటున్నారు ప్రేక్షకులు. సినిమా చూసి వచ్చిన వాళ్లను మీడియా పలకరించగా, సినిమా ఎలా ఉందో చెప్పమని కోరగా.. ఎక్కువమంది ‘యావరేజ్’ అని తేల్చేశారు. అంచనాలకు న్యాయం జరగలేదన్నట్టుగా మాట్లాడారు.. అయితే కొందరు మాత్రం రజనీ ఈజ్ బ్యాక్ అన్నారు. భాష సినిమా స్థాయిలో ఉందని కితాబిచ్చారు.

 • మద్యపానం తో ఏడు రకాల క్యాన్సర్లు!
  Published Date : 22-Jul-2016 5:04:09 IST

  మద్యపానం హానికరం అనేది పదే పదే వినిపించే మాట. అతిగా మద్యం సేవించడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు, గుండెపోటు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇది వరకూ అనేక అధ్యయనాలు తెలిపాఆయి. మద్యంతో వచ్చే క్యాన్సర్ల గురించి వివరించిందొక అధ్యయనం. దీని ప్రకారం ఆల్కాహాల్ ప్రభావంతో శరీరంలో ఏడు రకాల అవయవాలు ప్రభావితం అవుతాయని, వీటన్నింటిపైనా మద్యం ప్రభావం చూపిస్తుందని, మద్యపానం వల్ల ఈ అవయావాలకు క్యాన్సర్ సోకే అవకాశం ఉందని అధ్యయకర్తలు పేర్కొన్నారు. క్యాన్సర్ మరణాల్లో 5.8 శాతం మద్యం వల్ల సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.

  full article @ Timesofindia
 • కోటీశ్వరుడి కొడుకు.. నెల రోజుల సాధారణ జీవితం!
  Published Date : 22-Jul-2016 4:53:13 IST

  ఆయన వజ్రాల వ్యాపారి. కోటీశ్వరుడు. వారసుడికి జీవితం అంటే ఏమిటో అర్థం కావాలని భావించాడు. నెల రోజుల పాటు సాధారణమైన వాడిగా బతకమని చెప్పాడు. ఏడు వేల రూపాయల డబ్బులిచ్చి పంపాడు. తనయుడికి కనీసం ఫోన్ కూడా ఇవ్వకుండా పంపించాడు. ఈ నెల రోజుల్లో తనయుడు చాలా కష్టాలే పడ్డాడు. తొలి ఐదు రోజుల్లో అరవై చోట్లకు వెళ్లినా ఉద్యోగం దొరకలేదట. చివరకు ఏవో చిరుద్యోగాలు చేసుకొంటూ రూ.40తో బోజనం చేస్తూ మొత్తంగా నాలుగువేలు మిగిల్చి తండ్రి పెట్టిన పరీక్ష నెగ్గాడట ఆ తనయుడు.

  full article @ Sakshi

 • Widget not in any sidebars
 • ఇండియన్స్ కు ఇష్టమైన షాపింగ్ యాప్ ఇదే!
  Published Date : 22-Jul-2016 4:43:18 IST

  భారతదేశంలో అత్యంత ఎక్కువగా వినియోగంలో ఉన్న ఇ-షాపింగ్ యాప్ గా అమెజాన్ నిలుస్తోంది. ఫ్లిప్ కార్ట్ ను దాటేసి తొలి స్థానాన్ని సొంతం చేసుకుంది ఈ అప్లికేషన్. స్మార్ట్ ఫోన్ల విషయంలో అమెజాన్ 1.92 మిలియన్ల డౌన్ లోడ్స్ తో తొలి స్థానంలో ఉందని, ఫ్లిప్ కార్ట్ 1.72 మిలియన్ల డౌన్ లోడ్స్ తో ఆ తర్వాతి స్థానంలో ఉందని ఒక అధ్యయనం తేల్చింది. మిగతా షాపింగ్ యాప్సేవీ వీటికి పోటీ ఇచ్చే దశలో లేవు. డెస్క్ టాప్ ట్రాఫిక్ విషయంలో కూడా అమెజాన్ తొలిస్థానంలో, ఫ్లిప్ కార్ట్ ద్వితీయస్థానంలో ఉంది.

  full article @ scoopwhoop
 • ‘కబాలి’ ఎలా ఉంది..?
  Published Date : 22-Jul-2016 4:32:40 IST

  క్రేజ్ కు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ విడుదలైన రజనీకాంత్ సినిమాపై పెదవి విరుపులే ఎదురవుతున్నాయి. ఈ సినిమా అంతగా ఆకట్టుకోవడం లేదని అంటున్నారు రివ్యూయర్లు. మంచి నేపథ్యాన్నే తీసుకున్నా స్లో నెరేషన్, పంచ్ డైలాగులు లేకపోవడం, మితిమీరిన హింస, కన్ఫ్యూజన్ తో సినిమా ఆకట్టుకోదని వారు పేర్కొన్నారు. సినిమాకు ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది రజనీకాంత్ మాత్రమే, రజనీ గెటప్ , స్ట్రైల్స్ విషయంలో మంచి మార్కులే పడినా.. కథనం సినిమాకు పెద్ద లోటు అని విశ్లేషకులు అంటున్నారు. కబాలి అంచనాలను అందుకోలేకపోయాడంటున్నారు.

  full article @ Greatandhra
 • చంద్రబాబు జీవిత సినిమా.. ఎన్టీఆర్ కు స్థానముందా?
  Published Date : 22-Jul-2016 1:45:01 IST

  తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆయన అభిమాని, తెలుగుదేశం నేత ఒకరు ఈ సినిమాను తెరకెక్కించున్నారట. దీనికి టైటిల్ కూడా ఫిక్సయ్యింది. ‘చంద్రోదయం’ పేరుతో ఈ సినిమాను రూపొందించనున్నారట. మరి బాబు జీవితంపై సినిమా అంటే సహజంగానే కొన్ని సందేహాలు వస్తాయి. అందులో అన్ని అంశాల ప్రస్తావనా ఉంటుందా? ప్రత్యేకించి.. బాబు ఎన్టీఆర్ ను గద్దెదించి తను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అంశాన్ని సదరు బయోపిక్ లో ప్రస్తావిస్తారా?లేదా? అనేవి ఆసక్తికరమైన అంశాలే!

  full article @ Greatandrha