• అందులో యూఎస్ కన్నా ఇండియానే ముందుంది!
  Published Date : 08-Jul-2016 4:38:35 IST

  అమెరికా కన్నా భారత్ ముందుంది అంటే.. అదేదో మంచి విషయంలో కాదు కాలుష్యం విషయంలో. కాలుష్య తీవ్రతలో అమెరికా కన్నా భారత్ లోని కొన్ని ప్రాంతాలు ముందున్నాయని నాసా ప్రకటించింది. కొన్నేళ్లుగా తాము తీసిన ఉపగ్రహ ఛాయ చిత్రాలను ఆధారంగా చేసుకుని ఈ విషయాన్ని చెబుతున్నామని అంటోంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత చాలా ఎక్కువని నాసా అంటోంది. కాలుష్యం విషయంలో ఇండియాకు ఈ ర్యాంకు ఇవ్వడం అంత విశ్వసనీయంగా లేదు. అమెరికాను మించిన కాలుష్యం భారత్ లో ఉండే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

  full article @ Sakshi
 • గోల్ మాల్ -4 ఆ సౌత్ సినిమాకు రీమేక్ కాదు
  Published Date : 08-Jul-2016 4:25:57 IST

  గోల్ మాల్ సీరిస్ లో నాలుగో సినిమాపై వచ్చిన పుకార్లను దర్శకుడు రోహిత్ షెట్టి ఖండించాడు. తమ సినిమా తమిళ హిట్ ‘సూదుకవ్వం’ కు రీమేక్ అన్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టాడు. పూర్తిగా ఆధారరహితమైన వార్త అని షెట్టి స్పష్టం చేశాడు. గోల్ మాల్ ప్రాంచైజ్ లో వస్తున్న ఈ సినిమా కథాంశం గురించి ఇప్పుడేం చెప్పమని ఆయన తెలిపారు. అజయ్ దేవగణ్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని రోహిత్ షెట్టి వివరించారు. గోల్ మాల్ సీరిస్ లో నాలుగో సినిమా ఆకట్టుకుంటుందని రోహిత్ షెట్టి అన్నారు.

  full article @ http://indianexpress.com/article/entertainment/bollywood/golmaal-4-not-remake-of-soodhu-kavvum-rohit-shetty-2900973/
 • కొత్తవాడని ఎంకరేజ్ చేస్తే ఇంత పని చేస్తాడా?: రేష్మి
  Published Date : 08-Jul-2016 4:12:05 IST

  “అంతం’ సినిమా మేకర్లపై మండిపడుతోంది రేష్మి. గత కొన్ని రోజులుగా టీవీల్లో ఈ సినిమా టీజర్ కనిపిస్తోంది. “స్వర్గం చూపిస్తా..’ అంటూ యమ హాట్ గా కనిపించే రేష్మి దీనికి ప్రధాన ఆకర్షణ. అయితే తనకు చెప్పిన కథ వేరు.. ఈ సినిమా ప్రజెంటేషన్ వేరు అంటూ గగ్గోలు పెడుతోంది రేష్మి. వారం రోజుల్లో కంప్లీట్ చేస్తాను అంటే… ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చానని, కొత్తవాళ్లు ఎంకరేజ్ చేద్దామని వారికి సహకరిస్తే సినిమా మొత్తాన్ని మార్చేశారని రేష్మి అంటోంది. సినిమా రూపకర్తలు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు.

  full article @ Deccanchronicle
 • వైఎస్ కు ఘన నివాళి
  Published Date : 08-Jul-2016 3:55:13 IST

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 67 వ జయంతి సందర్భంగా వైఎస్ కుటుంబీకులు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం ఇడుపులపాయంలోని వైఎస్ ఘాట్ లు ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్ సతీమణి విజయమ్మ, తనయుడు జగన్ మోహన్ రెడ్డి, కూతురు వైఎస్ షర్మిల, కోడలు భారతి, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ కుటుంబీకులు..నివాళి అర్పించారు. భారీ ఎత్తున హాజరైన అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణల వ్యాప్తంగా వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు.

  full article @ Sakshi
 • విండీస్ బీచ్ లో సేదతీరుతున్న భారత క్రికెటర్లు!
  Published Date : 08-Jul-2016 3:44:49 IST

  వెస్టిండీస్ క్రికెట్ టీమ్ తో సమరానికి ముందు భారత క్రికెట్ జట్టు అందమైన బీచ్ లలో సేదతీరుతోంది. తొలి రోజు వెస్టిండీస్ లో ప్రకృతిని ఆస్వాదించిన భారత క్రికెటర్లు రెండో రోజు కూడా క్రికెట్ ప్రాక్టీస్ కు దూరంగానే ఉన్నారు. రెండో రోజు మనోళ్లు సరదాగా వాలీబాల్ ఆడుతూ గడపడం విశేషం. టీమ్ లో సభ్యులంతా రెండు జట్లుగా విడిపోయి వాలీబాల్ ఆడారు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ షర్ట్ విప్పి వాలీబాల్ ఆడాడు. ఆటగాళ్లు ఫిట్ నెస్ కోసం మనోళ్లు వాలీబాల్ ప్రాక్టీస్ చేశారు.

  full article @ Eenadu
 • యూట్యూబ్ లో ఎన్టీఆర్ హల్ చల్!
  Published Date : 08-Jul-2016 3:41:17 IST

  రెండు మిలియన్ల వ్యూస్ ను కంప్లీట్ చేసుకుంది ‘జనతా గ్యారేజ్’. ఎన్టీఆర్ హీరోగా నటించగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ విడుదల అయిన ముప్పై గంటల్లో ఈ మార్కును చేరడం విశేషం. ఇప్పటి వరకూ ఈ సినిమా టీజర్ ను 22 లక్షల మంది వీక్షించగా.. వీరిలో దాదాపు అరవై వేల మంది వ్యూయర్లు లైక్ బటన్ ను ప్రెస్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించారు. మోహన్ లాల్ ముఖ్య పాత్రపోషించాడు.

  full article @ Youtube
 • రెండేళ్ల గరిష్ట ధరకు బంగారం!
  Published Date : 08-Jul-2016 11:52:28 IST

  బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరల పెరుగుదల ఇంకా ఆగలేదు. తాజాగా బంగారం ధర రెండేళ్ల గరిష్టాన్ని చేరింది. బంగారం ధర ఔన్స్ కు రూ.92,624.29 కి ఎగసింది. 2014 మార్చిలో చివరి సారి గోల్డ్ ఈ స్థాయికి చేరింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఏకంగా రెండేళ్ల హై రేంజ్ ను తాకింది. దేశీయ మార్కెట్ లో కూడా బంగారం ధర పైపేకే వెళుతోంది. 24 క్యారట్స్ లో పది గ్రాముల ధర రూ.170 రూపాయలు పెరిగి, రూ.31,953 గా నమోదైంది.

  full article @ Express
 • క్యాచ్ పట్టి గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన నాజర్ హుస్సేన్
  Published Date : 06-Jul-2016 5:15:17 IST

  ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రికెట్ నుంచి ఎప్పుడో రిటైరయిపోయిన హుస్సేన్ క్రికెట్ బంతితో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అత్యంత ఎత్తుకు ఎగిరిన బంతిని క్యాచ్ పట్టడం ద్వారా హుస్సేన్ ఈ రికార్డు సృష్టించాడు. వాతావరణ పరిస్థితితో సంబంధం లేకుండా బంతిని హుస్సేన్ క్యాచ్ పట్టుకున్నాడు. 49 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బాల్ ను ఒడిసి పట్టాడు హుస్సేన్. ఇది వరకూ 31 మీటర్ల ఎత్తు నుంచి పడ్డ బంతిని పట్టడంగా ఉన్న రికార్డును హుస్సేన్ తెరమరుగు చేశాడు.

  full article @ Skysports
 • జీరో సైజంటే ఏమిటో చూపిస్తున్న ఇలియానా!
  Published Date : 06-Jul-2016 5:11:07 IST

  అదేదో సినిమాలో ఇలియానాను చూసి కరువు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావ్ అంటాడు హీరో. అప్పటికీ ఇప్పటికీ ఇల్లీ బేబీలో పెద్దగా మార్పు వచ్చినట్టుగా కనిపించడం లేదు. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ తో కలిసి విదేశీ విహారంలో ఉన్న ఇలియానా అక్కడ నుంచినే ఫొటోలను పోస్టు చేస్తోంది. ఫొటో గ్రాపర్ అయిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఇలియానాను డిఫరెంట్ డిఫరెంట్ పోజుల్లో క్యాప్చర్ చేస్తుండగా వాటిని పోస్టు చేసుకుని ఆనందిస్తోంది ఇలియానా. ఫొటోషాప్స్ హడావుడి లేకుండా చాలా న్యాచురల్ గా తీసిన పొటోలు అని చెబుతోంది ఇలియానా.

  full article @ Greatandhra
 • పరిణీతి చోప్రా హాట్ లుక్స్…
  Published Date : 06-Jul-2016 5:09:04 IST

  త్వరలోనే తెలుగు వారిని డైరెక్ట్ సినిమాతో పలకరించనున్న నటి పరిణీతి చోప్రా. బాలీవుడ్ లో మంచి ఊపు మీద ఉన్న ఈమె మహేశ్ బాబు హీరోగా రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా నటించనుంది.తన వెయిట్ ను చాలా వరకూ తగ్గించుకుని బాడీ ఫీచర్స్ ను మొత్తం మార్చేసుకున్న పరిణీతి ఒక పత్రిక ఫొటో షోలో యమ హాట్ పొజులే ఇచ్చింది. ఈ బీచ్ లుక్ లో పరిణీతి కుర్రాళ్ల మదిని చెదిరగొట్టేలా ఉంది. యశ్ రాజ్ బ్యానర్ పై ఒక సినిమాను చేస్తున్నట్టుగా పరిణీతి పేర్కొంది.

  full article @ Greatandhra
 • సుల్తాన్ సూపర్ హిట్ అంటున్న సెలబ్రిటీలు
  Published Date : 06-Jul-2016 5:05:03 IST

  ఈద్ సందర్భంగా విడుదల అయిన సల్మాన్ సినిమా ‘సుల్తాన్’ ను తెగ ప్రశంసిస్తున్నారు ఆయన సహచరులు, బాలీవుడ్ సెలబ్రిటీలు. ఈ సినిమాను తొలి రోజున చూసేసిన వాళ్లంతా తలా ఒక కితాబు ఇచ్చేశారు. కరణ్ జొహార్ ,అనుపమ్ ఖేర్, సుభాష్ ఘాయ్, రితేశ్ దేశ్ ముఖ్ తదితరులంతా సల్లూ సినిమా గురించి ట్విటర్ లో స్పందించారు. యశ్ రాజ్ వాళ్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రివ్యూ షోలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమాను వీక్షించారు. భారీ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

  full article @ Sakshi
 • వాళ్ల కోసం జుట్టును త్యాగం చేసిన చార్మి!
  Published Date : 06-Jul-2016 5:01:14 IST

  చార్మి ఒక ఆసక్తికరమైన రీతిలో ఉదారతను చాటుకుంది. చార్మి తన జుట్టును విరాళంగా ఇచ్చింది. క్యాన్సర్ తో బాధపడుతున్న ఇద్దరు యువతుల కోసం విగ్గును తయారు చేయడానికి తన జుట్టును కత్తిరించి ఇచ్చింది చార్మి. వారి కోసం తన జుట్టుతో విగ్గును తయారు చేయించి గిఫ్టుగా ఇస్తానని ఈ సినీ నటి పేర్కొంది. వారికి తనంటే చాలా అభిమానం అని, వారి పరిస్థితిని అర్థం చేసుకుని విగ్గులను ఇస్తున్నట్టుగా చార్మి పేర్కొంది. తన హేర్ స్టైలిస్ట్ తో మాట్లాడి జుట్టు కత్తిరించి ఇచ్చినట్టుగా చార్మి వివరించింది.

  full article @ Eenadu
 • రాహుల్ పెళ్లి చేసుకునే యువతిపై బీజేపీ ఎంపీ ట్వీట్
  Published Date : 06-Jul-2016 4:58:06 IST

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాహం గురించి ట్వీట్ చేశాడు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. యూపీ ఎన్నికల నేఫథ్యంలో వ్యంగ్యాన్ని జోడించి స్వామి ట్వీటాడు. రాహుల్ ఉత్తరప్రదేశ్ బ్రహ్మణయువతిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని స్వామి వ్యాఖ్యానించాడు. అయితే ఇదంతా తను సరదాగా చేసిన వ్యాఖ్యానమే అని స్వామి మరో ట్వీట్ లో పేర్కొన్నాడు. అటు సూర్యుడు ఇటు పొడిచినా రాహుల్ గాంధీ వివాహం చేసుకునే అవకాశం లేదని స్వామి ట్వీట్ చేశాడు. స్వామి వ్యాఖ్యానాలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలను వారు ఖండించారు.

  full article @ twitter
 • మరదలిని అస్సలు పట్టించుకోని సల్మాన్ ఖాన్!
  Published Date : 06-Jul-2016 4:54:41 IST

  మలైకా ఆరోరా.. నటుడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య. సల్మాన్ ఖాన్ కు స్వయానా మరదలు. మరి తన ఇంటి అమ్మాయి ఒక బహిరంగ వేదిక మీద ఎదురు పడితే? ఎలా ఉంటుందో అనుకున్నారంతా. తీరా ఒక టీవీ కార్యక్రమంలో సల్లూ, మలైకాలు ఎదురుపడ్డా అస్సలు పట్టించుకోనట్టుగా వ్యవహరించారు. సుల్తాన్ ప్రచారం కోసం సల్మాన్ ఒక టీవీ షోకి వెళ్లగా దానికి మలైకా ఒక జడ్జిగా వ్యవహరించింది. మిగతా వాళ్లందరితోనూ కలసిపోయిన సల్లూ మలైకాకు మాత్రం కనీసం హాయ్ కూడా చెప్పలేదు. తమ్ముడితో విడాకులు తీసుకుందని కోపమేమో!

  full article @ Youtube
 • స్మృతి ఇరానీ పదవీ మార్పు వెనుక ఉన్నదెవరు?
  Published Date : 06-Jul-2016 4:51:57 IST

  మోడీకి అత్యంత ఇష్టమైన మంత్రి.. బీజేపీ విధానాలతో దూసుకుపోతోంది.. రాహుల్ గాంధీకి గట్టి సవాలే విసురుతోంది.. అనే పేరును కలిగిన స్మృతీ ఇరానీ శాఖను ఎందుకు మార్చారు? కీలకమైన మానవ వనరుల శాఖ నుంచి ఆమెను అంతగా ప్రాధాన్యంలేని ఔళీ శాఖకు మార్చడానికి వెనుక ఉన్న కథేంటి? అంటే ఆర్ఎస్ఎస్ పేరు వినిపిస్తోంది. కొన్ని పరిణామాల ఆధారంగా కూడా స్మృతి శాఖ మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత విద్యార్హతకు సంబంధించిన వివాదం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వ్యవహారాలపై అసంతృప్తితోనే స్మృతి శాఖను మార్పించిందట ఆర్ఎస్ఎస్.

  full article @ Sakshi