• మోడీ ఇంటర్వ్యూ తీరుపై నెటిజన్ల చతురోక్తులు!
  Published Date : 28-Jun-2016 7:27:01 IST

  అర్నవ్ గోస్వామి అంటే ఆవేశానికి పెట్టింది పేరు. “నేషన్ నీడ్స్ టు నో..’ అంటూ రాజకీయ నేతలపై విరుచుకుపడుతూ ఉంటాడు అర్నవ్. మరి అలాంటి జర్నలిస్టు చాలా పొలైట్ గా మాట్లాడితే, అవతలవారున్నదెవరైనా ఒక్కటే అంటూ విరుచుకుపడే ఈయన చాలా వినమ్రంగా వ్యవహరిస్తే..కచ్చితంగా ఏదో తేడా కొడుతుంది. చూసే వాళ్లకు కూడా చాలా డౌట్లే వస్తాయి. ఇప్పుడు అదే జరిగింది.మోడీని ఈ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేసిన తీరుపై నెటిజన్లు విమర్శనాత్మకమైన చతుర్లు విసిరారు. జర్నలిస్టులా కాకుండా మోడీ భక్తుడిలా అర్నవ్ ఇంటర్వ్యూ చేశాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  full article @ Scoopwhoop
 • టీడీపీలో రెడ్డి వర్సెస్ చౌదరి
  Published Date : 28-Jun-2016 7:17:17 IST

  అనంతపురం టీడీపీలో ఇప్పటికే ఉన్న సవాలక్ష గొడవలకు తోడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొనసాగుతున్న దివాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరిల గొడవ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. చౌదరి తీరుకు నిరసనగా తను అనంతలో ధర్నాకు దిగుతానని జేసీ హెచ్చరించాడు. అయితే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలు ఇలా గొడవలకు దిగితే ప్రజల్లో పార్టీ పరువు, ప్రభుత్వం పరువు పోతుందని జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్నారు. వీరికి సర్ధిచెప్పడానికి వారు తంటాలూ పడుతున్నారు. అయితే జేసీ, చౌదరిలు మాత్రం ఈ సారి అమితుమి తేల్చుకుంటామంటున్నారు.

  full article @ Sakshi
 • సింగపూర్ నిబంధనలతో రాష్ట్రానికి ముప్పే!
  Published Date : 28-Jun-2016 6:43:51 IST

  అమరావతి నిర్మాణ ఒప్పందాల్లో భాగంగా సింగపూర్ కంపెనీలు పెట్టిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన ముప్పుగా పరిణమించనున్నాయా? ఏపీ ప్రభుత్వానికి, సింగపూర్ సంస్థలకు కుదిరిన ఒప్పందాల్లో భాగంగా.. పెట్టిన కండీషన్లను చూస్తే ఇదే అభిప్రాయం కలగకమానదు. రాజధాని నిర్మాణం విషయంలో పాలుపంచుకునే కంపెనీలు ఆర్థికంగా దివాళా తీసినా వాటిని ఆదుకునే బాధ్యత ఏపీ గవర్నమెంటుదే అని ఆ నిబంధనలు చెబుతున్నాయి. ఒప్పంద వివరాలను బట్టి చూస్తే రాష్ట్రానికి అనుకూలంగా ఏ ఒక్క నిబంధనా లేదు, సర్వం సింగపూర్ కంపెనీలకే అనుకూలంగా ఉందని స్పష్టం అవుతోంది.

  full article @ Greatandhra
 • బ్రిటన్ లా ఢిల్లీలోనూ రెఫరండం కావాలి!
  Published Date : 24-Jun-2016 11:11:23 IST

  బ్రెగ్జిట్ పరిణామాలు కేవలం ఆర్థిక వ్యవహారాలనే కాదు.. రాజకీయ వ్యవహారాలను కూడా ప్రభావితం చేస్తున్నట్టుగానే ఉన్నాయి. ఈయూ నుంచి వైదొలగాలా.. వద్దా అనే అంశం గురించి బ్రిటన్ లో రెఫరెండం నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించినట్టుగానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి అంశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశాడు. దేశ రాజధాని నగరానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లేనిసంగతి విదితమే. ఈ విషయంపై కేజ్రీవాల్ చాన్నాళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

  full article @ Ndtv
 • ‘బ్రెగ్జిట్’ పై భారతీయుల ఫన్నీ ట్వీట్లు
  Published Date : 24-Jun-2016 10:58:58 IST

  ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుండటంతో ఇది అందరికీ ఆసక్తిదాయకమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు సరదా ట్వీట్లను పోస్టు చేస్తున్నారు. బ్రెగ్జిట్ పూర్వపరాలను ప్రస్తావిస్తూ ఫన్ పండిస్తున్నారు. బ్రిటన్ ఎగ్జిట్ అనే కాన్సెప్టు అనేది కొత్తదేమీ కాదని.. ప్రపంచంలో చాలా దేశాలను పాలించిన బ్రిటన్ క్రమంగా వాటి నుంచి ఎగ్జిట్ అవుతూ వచ్చిందని ఒకరు చమత్కరించగా, యూరో కప్ ఫుట్ బాల్ నిష్క్రమణను కూడా బ్రెగ్జిట్ గా అభివర్ణించారు మరొకరు.

  full article @ Timesofindiab
 • వాట్సాప్ నుంచి రోజుకు పది కోట్ల ఫోన్ కాల్స్!
  Published Date : 24-Jun-2016 10:31:02 IST

  అప్లికేషన్ సర్వీస్ వాట్సాప్ నుంచి ప్రపంచ వ్యాప్తంగా రోజుకు పదికోట్ల ఫోన్ కాల్స్ వెళుతున్నాయట. ఒక వాట్సాప్ నంబర్ నుంచి మరో వాట్సాప్ నంబర్ కు ఉండే ఫోన్ సదుపాయాన్ని నిత్యం ఇంతమంది ఉపయోగించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను వాట్సాప్ విడుదల చేసింది. ప్రతి సెకనుకూ వెళుతున్న వాయిస్ కాల్స్ సంఖ్య 1,110 అని వాట్సాప్ పేర్కొంది. ప్రధానంగా మెసేజ్, ఫొటో, వీడియో షేరింగ్ సైట్ కు వాట్సాప్ వినియోగంలో ఉంది. కొంతకాలం కిందట వాయిస్ కాల్ సర్వీస్ ను కూడా ఈ అప్లికేషన్ లో ప్రవేశపెట్టారు.

  full article @ Firstpost
 • ఈ ఇంటర్వ్యూతో తెలుగుదేశానికి ఇబ్బందే..!
  Published Date : 24-Jun-2016 10:13:51 IST

  తనను ఎన్టీవీ నుంచి తొలగించడానికి సంబంధించిన పరిణామాలను కూలంకషంగా వివరించాడు సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒత్తిడి మేరకే తనను ఎన్టీవీ నుంచి తొలగించారని ఇది వరకే స్పష్టం చేసిన కొమ్మినేని అందుకు పూర్వపరాలను వివరించారు. నిస్పాక్షికంగా వ్యవహరించినందుకే తనను ఇబ్బందుల పాల్జేశారని.. జర్నలిస్టులకు ఈ మాత్రం స్వేచ్ఛ లేకుండా చేయడం చంద్రబాబుకు తగదని కొమ్మినేని హితబోధ చేశారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కొమ్మినేని ప్రశంసించడం విశేషం. తెలుగుదేశం తీరును ఎండగడుతున్నట్టుగా ఉంది కొమ్మినేని ఇంటర్వ్యూ.

  full article @ Youtube
 • సాక్షి కి లోకేష్ మేలు చేశాడా..?
  Published Date : 24-Jun-2016 9:59:23 IST

  వైఎస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా అంటేనే తెలుగుదేశం వాళ్లు మండి పడుతారు. వీలైనప్పుడల్లా సాక్షి టీవీ ప్రసారాలకు అంతరాయాలు కలిగించడానికి తెలుగుదేశం ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ జగన్ మీడియాకు మేలు చేశాడా? తమకు వ్యతిరేక వాయిస్ మాత్రమే కాదు.. తెలుగు మీడియా లో నిస్పాక్షికమైన వాయిస్ ఏదీ వినిపించకూడదు అనే ప్రయత్నంలో భాగంగా లోకేష్ అప్రజాస్వామికంగా వ్యవహరించి పరోక్షంగా సాక్షి టీవీ రేటింగ్స్ పెంచడానికి సహకరించడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  full article @ Greatandhra
 • మురగదాస్ సినిమాలో మహేశ్ డిఫరెంట్ లుక్!
  Published Date : 24-Jun-2016 9:38:52 IST

  ప్రతి సినిమాలోనూ తనను తాను కొత్త గా ప్రజెంట్ చేసుకొంటూ వస్తున్నాడు ప్రిన్స్ మహేశ్ బాబు. హేర్ స్టైల్ , కాస్ట్యూమ్స్ విషయంలో కొత్త దనాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడు మురగదాస్ బైలింగ్వల్ మూవీలో మహేశ్ గడ్డంతో కనిపించనున్నాడని సమాచారం. ఇంత వరకూ మహేశ్ దాదాపుగా క్లీన్ షేవ్ తో, లైట్ బియర్డ్ తో కనిపించాడు. ఈ సారి మాత్రం దట్టంగా పెంచిన గడ్డంతో కనిపించనున్నాడు. ఇటీవలే ‘నాన్నకు ప్రేమతో’లో ఎన్టీఆర్ పొడవాటి గడ్డంతో డిఫరెంట్ స్టైల్ లో కనిపించాడు. మహేశ్ గడ్డం ఎలా ఉండబోతోందో!

  full article @ Apnewscorner
 • పాంటింగ్ రికార్డును సమం చేసిన ధోనీ
  Published Date : 24-Jun-2016 9:22:02 IST

  భారత వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ నెలకొల్పిన అరుదైన రికార్డును సమం చేశాడు. జింబాబ్వే పర్యటనలో భారత్ ఆడిన మూడో టీ20 తో ధోనీ అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లకు కెప్టెన్ గా నంబర్ వన్ స్థానాన్ని పాంటింగ్ తో పంచుకున్నాడు. తన కెరీర్ లో పాంటింగ్ మొత్తం 324 అంతర్జాతీయ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించగా ధోనీ దాన్ని సమం చేశాడు. ధోనీ మొత్తం 194 వన్డే, 70 టీ20, 60 టెస్టు మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు.

  full article @ Indiatoday
 • సంబరాల్లో బ్రిటీషర్లు.. ప్రధానమంత్రి రాజీనామా..!
  Published Date : 24-Jun-2016 8:43:21 IST

  ఈయూ నుంచి వైదొలగడం పట్ల సానుకూలంగా వ్యక్తమైన ప్రజాభిప్రాయం బ్రిటీషర్లను ఆనందంలో ముంచెత్తుతోంది. ప్రత్యేకించి ఇంగ్లండ్ లో ఇందుకు సంబంధించి సంబరాలు మొదలయ్యాయి. తమకు స్వతంత్రం వచ్చిందంటూ రోడ్లపైకి వచ్చి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే బ్రిటన్ ప్రధాని కామెరన్ మాత్రం రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని కామెరన్ వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన అభిప్రాయానికి వ్యతిరేకమైన ఫలితం రావడంతో నాలుగేళ్ల పదవీ కాలాన్ని త్యాగం చేస్తూ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించాడు. అక్టోబర్ లో బ్రిటన్ కు కొత్త ప్రధాని వస్తాడని వ్యాఖ్యానించాడు.

  full article @ Sakshi
 • పౌండ్ పతనం.. బంగారం ధరకు రెక్కలు!
  Published Date : 24-Jun-2016 8:34:21 IST

  ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన పరిణామంతో పౌండ్ విలువలో భారీ పతనం నమోదైంది. 37 సంవత్సరాల కనిష్ట ధరకు పడిపోయింది యూకే కరెన్సీ విలువ. నిన్నటి వరకూ పౌండ్ విలువ రూ.98 వరకూ ఉంది. అది ఒక్కసారిగా రూ.91 దశకు పడిపోయింది. బ్రెగ్జిట్ పరిణామాలతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్ల మేరకు పతనమైంది. నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఈ పరిణామాల మధ్య శుక్రవారం ఉదయమే బంగారం ధరలో రూ.1700 వృద్ధి నమోదైంది.

  full article @ Eenadu
 • గల్లా జయదేవ్.. రూ.కోట్ల బిల్డింగ్ కారుచౌకగా!
  Published Date : 24-Jun-2016 8:13:22 IST

  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరులో బ్యాంకు వేలానికి పెట్టిన ఒక బిల్డింగ్ ను ఈయన కారు చౌకగా కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.బ్యాంకు జప్తు చేసి వేలానికి ఉంచిన ఈ బిల్డింగ్ విషయంలో ఎవరూ పోటీకి రాకుండా జయదేవ్ అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని తెలుస్తోంది. వేలంలో ఎవరూ పోటీకి రాకుండా చేసుకుని రూ.7కోట్ల పై విలువ చేసే భవంతిని రూ.2.8కోట్ల కనీస ధరకే సొంతం చేసుకోవాలని జయదేవ్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా అధికార దుర్వినియోగం అని విమర్శలు వస్తున్నాయి.

  full article @ Sakshi
 • సౌతిండియన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్-2016 ఫొటో గేలరీ
  Published Date : 22-Jun-2016 10:36:46 IST

  హైదరాబాద్ వేదిక ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. దక్షిణాది సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరై శోభను తెచ్చారు. దక్షిణభారత భాషల సినిమాలకు సంబంధించి వివిధ కేటగిరిల అవార్డులను బహుకరించారు.

  full article @ Greatandhra
 • వారికి దేవుడు తగిన శాస్తి చేస్తాడు: ముద్రగడ
  Published Date : 22-Jun-2016 10:23:19 IST

  తన నిరాహారదీక్షను భగ్నం చేయడానికి పోలీసులు తమ కుటుంబంపై దౌర్జన్యం చేశారని, తన భార్యను కోడలిని అవమానించారని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఇందుకు కారకులైన వారికి దేవుడు తగిన శాస్తి చేస్తాడని అంత వరకూ ఏ పండగలూ జరుపుకోమని ఆయన అన్నారు.

  full article @ Sakshi