• మాల్యాను రప్పించడానికి ఈడీ కొత్త ఎత్తు!
  Published Date : 17-Aug-2016 8:23:49 IST

  ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని విల్ ఫుల్ డీఫాల్టర్ గా చల్లగా బ్రిటన్ కు జారుకున్న విజయ్ మాల్యాను ఇండియాకు రప్పించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బ్రిటన్ తో ఉన్న ఒక పాత ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని మాల్యాను రప్పించడానికి ఈడీ ప్రయత్నిస్తోంది. కీలకమైన కేసుల్లో నిందితులను, సాక్షులను మార్చుకునే ఒప్పందాన్ని ఉపయోగించుకుని మాల్యాను రప్పించాలనేది ఈడీ ప్రయత్నం. దీని కోసం విదేశాంగ శాఖ సహాయాన్ని కోరినట్టు సమాచారం. మరి ఇలాగైనా మాల్యాను రప్పిస్తారా?

  full article @ Sakshi
 • టీమిండియా.. టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్ 1
  Published Date : 17-Aug-2016 8:18:58 IST

  టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది. 112 పాయింట్లతో కొహ్లీ సారధ్యం లోని జట్టు తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పాకిస్తాన్ 111 తో ఉంది. మూడో స్థానానికి పడిపోయింది ఆస్ట్రేలియా. శ్రీలంకతో చిత్తుగా ఓడిన కంగారూల జట్టు తొలి స్థానం నుంచి మూడో స్థానంలోకి పడిపోయింది. ఆసీస్ ఓటమి మరోవైపు విండీస్ తో టెస్టు సీరిస్ ను 2-0 తో గెలవడం భారత్ కు కలిసొచ్చింది.మరోవైపు ఆసీస్ తో విజయంతో శ్రీలంక పది పాయింట్ల ను సంపాదించుకుని ఆరో స్థానానికి ఎగబాకింది.

  full article @ Eenadu
 • సంతోషం అవార్డుల విజేతలు వీళ్లే!
  Published Date : 16-Aug-2016 6:03:01 IST

  ప్రతియేటా జరిగే సంతోషం సినీ అవార్డుల పండగ ఈ సారి కూడా అంతే ఘనంగా జరింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకరత్న దాసరి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం తరపు నుంచి సినిమాలకు అవార్డులు రాకపోవడాన్ని తప్పుపట్టాడు. బాహుబలి కు గానూ ప్రభాస్ ఉత్తమ నటుడి అవార్డును పొందగా, అనుష్క రుద్రమదేవికి ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకుంది. దేవీశ్రీ కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కింది. శ్రీమంతుడులో నటనకు రాజేంద్రప్రసాద్ కు ఉత్తమ సహాయ నటుడి అవార్డు దక్కింది.

  full article @ Eenadu
 • వామ్మో.. సోనాక్షికి అంతమంది ఫాలోయర్లా!
  Published Date : 16-Aug-2016 5:52:50 IST

  ఫేస్ బుక్ లో అమితమైన ఆదరణతో దూసుకుపోతోంది సోనాక్షి సిన్హా. ఈ దబంగ్ సుందరి పాలోయర్ల సంఖ్య తాజాగా రెండు కోట్ల ఇరవై లక్షల ఫాలోయర్ల మార్కును రీచ్ అయ్యింది. తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ను, సినిమాల విశేషాలను అందించడంతో పాటు.. కొన్ని కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను కూడా చెబుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సోనాక్షి ఫేస్ బుక్ అకౌంట్ కు మంచి ఆదరణ కనిపిస్తోంది. మిగతా హీరోయిన్ల కన్నా ఈ విషయంలో ముందుంది.

  full article @ Facebook
 • రాళ్ల మధ్యలో చిరుత ఉంది.. కనుక్కోండి!
  Published Date : 16-Aug-2016 5:44:05 IST

  సుధీర్ శివరాం ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్. తన ప్రతిభను ప్రదర్శిస్తూ.. జనాల మెదడుకు పరీక్ష పెట్టాడు ఇతడు. కేవలం రాళ్లు మాత్రమే ఉన్నాయనుకునే ఫొటోలో ఒక చిరుత పులి దర్జాగా పడుకుని ఉంటుంది. ఆకులో ఆకునై.. అన్నట్టుగా ఆ చిరుతపులి రాళ్లలో కలిసిపోయింది. ఆరావళి పర్వత శ్రేణుల్లో ‘చిరుత పులుల రాజ్యం౤’ గా పేర్గాంచిన రాజస్థాన్ లోని బేరా గ్రామం వద్ద ఈ ఫొటోను తీశాడు శివరాం. ఈ ప్రాంతం అంటే తనకు ఇష్టమని, వీలు చిక్కినప్పుడు ఇక్కడ ఫొటోలు తీస్తుంటే అని చెప్పాడాయన.

  full article @ Sakshi
 • కేజ్రీవాల్ కోసం వీరేంద్ర సెహ్వాగ్ ప్రార్థన!
  Published Date : 16-Aug-2016 5:33:06 IST

  ఢిల్లీ నవాబ్ వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ నుంచి రిటైరైనా, తన సరదా కామెంట్లతో , ట్వీట్ల తో తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరూ తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు విభిన్నమైన రీతిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. తమ సీఎంను జలుబు దరి చేరకూడదని.. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వీరూ ఈ ఆకాంక్షను వ్యక్త పరిచాడు. దీనికి కేజ్రీవాల్ కూడా స్పందించడం విశేషం. తరచూ జలుబుతో బాధపడే కేజ్రీవాల్.. తన కోసం భారత మాజీ క్రికెటర్ వ్యక్త పరిచిన ఆకాంక్షకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

  full article @ Twitter
 • అభిమానులకు రామ్ చరణ్ గిఫ్ట్ ఇదిగో!
  Published Date : 15-Aug-2016 6:15:44 IST

  అనుకున్నట్టుగానే స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా చరణ్ ‘ధ్రువ’ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు ఇది మంచి గిఫ్టే అని చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ , టైటిల్ లోగో.. వెనుక కథేంటి అనేది ఆసక్తికరంగా మారింది. టైటిల్ లో ‘8’ అంకె ప్రత్యేకంగా కనిపిస్తుండటంతో అదెందుకు అనేది చర్చగా మారింది. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇది ఎనిమిదో సినిమా. మరి దానికి సూచికగా ఈ నంబర్ వేశారా లేక ఈ నంబర్ కూ హీరో క్యారెక్టరేజేషన్ కు సంబంధం ఉందా?

  full article @ Greatandhra
 • కృష్ణా తీరం.. జనసంద్రం..!
  Published Date : 15-Aug-2016 6:07:44 IST

  వరస సెలవులు పుష్కరాల రద్దీని పెంచేశాయి. ఆదివారం సెలవు కావడం.. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం రూపంలో మరో రోజు కలిసి రావడంతో పుష్కరాల తీరాలకు జనతాకడి పెరిగింది. కృష్ణా తీరాల్లో జన హోరు కనిపిస్తోంది. తొలి రెండు రోజుల పాటూ పుష్కర ఘాట్లు ఖాళీగానే కనిపించాయి. అయితే తీరా సెలవులు రావడంతో ఈ హోరు పెరిగింది. ఏపీలో ప్రధానంగా విజయవాడ కేంద్రంగా ప్రభుత్వం పుష్కర స్నానాలకు ఏర్పాటు చేసింది, తెలంగాణలో పాలమూరు జిల్లా అలంపూర్ వేదికగా ఎక్కువ మంది భక్తులు పుష్కర స్నానం చేస్తున్నారు.

  full article @ Sakshi
 • షరపోవా.. తిరిగి టెన్నిస్ కోర్టుకొచ్చేస్తోంది!
  Published Date : 15-Aug-2016 6:01:25 IST

  అన్ని కుదిరితే వచ్చే ఏడాది జనవరిలో మారియా షరపోవ తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగిడే అవకాశం ఉందని అంటున్నారు రష్యన్ టెన్నిస్ అధికారులు. డోపింగ్ లో చిక్కుకుని ఆటకు దూరం అయిన షరపోవా.. రీ ఎంట్రీ గురించి వారు ప్రకటన చేశారు. 2017 జనవరిలో బరిలో దిగే అవకాశం ఉందని వారు అన్నారు. అభిమానులను నిశ్చేష్టులు చేస్తూ.. షరపోవా డోపింగ్ లో పట్టుబడిన సంగతి తెలిసిందే. అంతటితో ఆమె కెరీర్ కు తెరపడినట్టే అని కొంతమంది వ్యాఖ్యానించగా.. రష్యన్ అధికారులేమో వచ్చే ఏడాది ఆమె తిరిగొస్తుందని అంటున్నారు.

  full article @ Smh
 • ఎర్రకోటపై స్వతంత్ర దినోత్సవ వేడుకలు
  Published Date : 15-Aug-2016 5:53:57 IST

  70 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది భారతావణి. దేశంలోని వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజలు , విద్యార్థులు, ప్రముఖులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆనందంగా మమేకమయ్యారు. ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా రాజ్ ఘాట్ లో మహాత్ముడి కి నివాళులు అర్పించి.. మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో త్రివిధ దళాల అధిపతులు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. అద్యంతం శోభాయమానంగా జరిగిన ఈ వేడుకలు ఆహుతులను అలరించాయి.

  full article @ Sakshi
 • ‘జనతా..’ ఆడియోకు సమంత ఎందుకు రాలేదంటే..
  Published Date : 15-Aug-2016 5:47:55 IST

  తను ప్రధాన హీరోయిన్ గా నటించిన సినిమా ‘జనతా గ్యారేజ్’ ఆడియో విడుదల వేడుకకు తన గైర్హాజరి గురించి వివరణ ఇచ్చింది సమంత. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకకు ఆమె రాకపోవడం చర్చనీయాంశంగా మారి నేపథ్యంలో సమంత స్పందిస్తూ.. అనారోగ్య కారణాల వల్లనే తను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని వివరణ ఇచ్చింది. తన గైర్హాజరి గురించి మొదలైన రూమర్ల కు పుల్ స్టాప్ పెట్టేందుకు సమంత ట్విటర్ ద్వారా స్పందించింది. రాకపోవడానికి ప్రత్యేక కారణం లేదని స్పష్టం చేసింది. మరి ఇంతటితో ఆమె పై పుకార్లు ఆగుతాయేమో!

  full article @ Twitter
 • ఇది తొలి పుట్టిన రోజు.. ఆనందంగా ఉంది!
  Published Date : 15-Aug-2016 5:22:22 IST

  తెలుగు సినిమా పాటలు కూడా పాడిన పాకిస్తానీ నేపథ్యం ఉన్న గాయకుడు అద్నాన్ సమీ. ఈ రోజు తన తొలి పుట్టిన రోజు అని అంటున్నాడితను. అదేమిటంటే.. ఇండియన్ గా , ఇండియాలో తను జరుపుకొంటున్న తొలి పుట్టిన రోజు ఇది అంటున్నాడు. దీని గురించి ట్వీట్ పెట్టాడు అద్నాన్. భారత పౌరసత్వం తీసుకున్న తర్వాత తొలి పుట్టిన రోజు జరుపుకోవడం ఆనందాన్ని ఇస్తోందని ఆ ట్వీట్ పేర్కొన్నాడు. అలాగే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపాడితను. అద్నాన్ కు పలువురు సెలబ్రిటీలు బర్త్ డే విషెష్ చెప్పారు.

  full article @ Twitter
 • భారత రాష్ట్రపతి కూతురినే వేధించాడు..!
  Published Date : 14-Aug-2016 6:59:35 IST

  ఇంటర్నెట్ లో అమ్మాయిలకు అసభ్యకరమైన రీతిలో వేధించడం ఆ జాడ్యాన్ని అలవాటుగా కలిగిన వారికి మరింత సులువు. ఈ విషయంలో ఎంతోమంది అమ్మాయిలు బాధితులుగా నిలుస్తున్నారు. మరి ఇలాంటి వేధింపుల విషయంలో ఎవరూ మినహాయింపు కాదని అనుకోవాల్సి వస్తోంది. ఏకంగా భారత రాష్ట్రపతి తనయ, కాంగ్రెస్ నేత షర్మిష్టా ముఖర్జీకి ఈ తరహా వేధింపులు ఎదురుకావడం.. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వివరించడం జరిగింది. తనకు అసభ్య సందేశాలు పంపిన వ్యక్తి ఫేస్ బుక్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ను కూడా ఆమె పోస్టు చేశారు.

  full article @ Facebook
 • సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ రివ్యూ
  Published Date : 14-Aug-2016 6:57:23 IST

  మెగా ఫ్యామిలీ హీరో తాజా సినిమా “తిక్క’ విషయంలో క్రిటిక్స్ పెదవి విరిచారు. ఊపు మీద కనిపిస్తున్న సాయి ధరమ్ ఈ సినిమాను ఎందుకు చేశాడా? అని అంటూ వీరు కడిగేస్తున్నారు. రేటింగ్స్ విషయంలో కూడా వారు ఏ మాత్రం దయ చూపడటం లేదు ఈ సినిమా విషయంలో. ఈ మెగా మేనల్లుడి కెరీర్ లో ఇంత వరకూ ‘రేయ్’ ను పరమ చెత్త సినిమా చెప్పవచ్చు అనుకొంటే.. దాని కన్నా ఒక అడుగు కింది స్థాయిలో ‘తిక్క’ నిలబడుతుందని రివ్యూయర్లు అంటున్నారు. ఈ సినిమాకు ఫెయిల్ మార్కులేస్తున్నారు.

  full article @ Greatandhra
 • విశాల్ ‘ఒక్కడొచ్చాడు’ మూవీ ఫొటో గ్యాలరీ
  Published Date : 14-Aug-2016 6:53:50 IST

  ఈ ఏడాది మూడో దండయాత్రకు సిద్ధం అయ్యాడు తమిళ హీరో విశాల్. ఇప్పటికే విశాల్ వి రెండు సినిమాలు విడుదల అయ్యాయి. “ఒక్కడొచ్చాడు’ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫొటో ఆల్బమ్ ఒకటి విడుదల చేశారు. ఇందులో విశాల్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో తెలుగు నటుడు జగపతి బాబు కూడా కీలక పాత్ర పోషించడం విశేషం. చాన్నాళ్ల తర్వాత వడివేలు ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటోందో!

  full article @ greatandhra