• ఆయన ఎప్పటికీ నా గురువే: విశాల్

    Published Date : 13-Nov-2017 2:25:19 IST

    తమిళ నటుడు అర్జున్ ఎన్నటికీ తన గురువే అన్నాడు విశాల్. తను సినిమాల్లోకి రావడానికి కారణమే అర్జున్ అని విశాల్ స్పష్టం చేశాడు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టకమునుపు.. అర్జున్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు విశాల్. అర్జున్ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విశాల్ ‘ప్రేమ చదరంగం’ సినిమాతో నటుడు అయ్యాడు. ఆ సినిమా సక్సెస్ అనంతరం పందెంకోడి, పొగరు తదితర సినిమాలతో వరస హిట్లను కొట్టి నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు విశాల్- అర్జున్ కాంబోలో ఒక సినిమా వస్తోంది.

Related Post