• ఆ సినిమాకు మూడో పార్టు వస్తుందట..!

    Published Date : 18-Aug-2017 3:21:25 IST

    వీఐపీ సినిమాకు మూడో పార్టు తీస్తామని ప్రకటించాడు ధనుష్. ఇప్పటికే ఆ సినిమా రెండు ఇన్ స్టాల్ మెంట్స్ గా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ హీరో విఐపీ-2 ప్రమోషనల్ యాక్టివిటీస్ లో బిజీగా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. వీఐపీకి మూడో పార్టు ఉంటుందని ప్రకటించాడు. రెండో భాగం అంత విజయవంతం కాలేదనే ప్రచారం నేఫథ్యంలో ధనుష్ మూడో పార్టు తీస్తామని ప్రకటన చేయడం గమనార్హం. రెండో పార్టు విజయవంతం అయ్యిందని ఈ సినిమా దర్శకురాలు సౌందర్య ప్రకటించింది.

Related Post