• హీరోలకు ఇది త్రిబుల్ యాక్షన్ సీజన్..!
    Published Date : 16-May-2017 8:31:31 IST

    గత ఏడాదిలో సూర్య త్రిబుల్ రోల్ చేసిన సినిమా వచ్చింది. ట్వంటీ ఫోర్ మూవీలో సూర్య మూడు పాత్రల్లో కనిపించాడు. అందులో ఒకటి విలన్ రోల్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అందులో ఒకటి నెగిటివ్ రోల్ అనే ప్రచారం ఉంది. ఇక మరోవైపు విజయ్ కూడా ట్రిపుల్ యాక్షన్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. అట్లీ దర్వకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మొత్తానికి సౌత్ లో హీరోలకు ట్రిపుల్ యాక్షన్ సీజన్ నడుస్తున్నట్టుంది.