• తమన్నా కాదన్నా.. క్వీన్ ఆగడం లేదు!

    Published Date : 21-Apr-2017 1:11:14 IST

    క్వీన్’ దక్షిణాది రీమేక్ లో తమన్నా భాటియా ప్రధాన పాత్ర పోషిస్తుందని వార్తలు రావడం, ఆ సినిమా నుంచి తమ్మూ తప్పుకోవడం.. చివరకు ఆ సినిమా ఆగిపోవడం జరిగిపోయింది. రేవతి దర్శకత్వంలో తమిళంలో రూపొందాల్సిన సినిమా ఆ విధంగా ఆగిపోయింది. అయితే కన్నడ వెర్షన్ ను మాత్రం ఆపడటం లేదు నిర్మాత త్యాగరాజన్. కన్నడలో పారుల్ యాదవ్ ను ప్రధానపాత్రలో పెట్టి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నటుడు రమేశ్ అరవింద్ కన్నడ వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. మరి తమిళ, తెలుగుకు దాన్నే డబ్బింగ్ చేస్తారేమో!

Related Post