• శ్రుతి హాసన్ సినిమా ఆగిపోయిందా!

    Published Date : 02-Aug-2017 8:22:36 IST

    శ్రుతి హాసన్ బాలీవుడ్ సినిమా ‘యారా’ ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. విద్యుత్ జమాల్ ఇందులో హీరో. తిగ్మాంషు ధులియా దర్శకుడు. షూటింగ్‌ పూర్తవకుండానే ఆగిపోయినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఇందులో విద్యుత్‌ జమ్వాల్‌ 21ఏళ్ల యువకుడి నుంచి 50 ఏళ్ల వృద్ధుడిలా నటించాల్సి ఉంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు శరీరాకృతిని మలుచుకుంటూ విద్యుత్‌ చాలా కష్టపడ్డాడట. అసలైతే ఈ సినిమా మేలోనే విడుదల కావాల్సి ఉందని విద్యుత్‌ తెలిపారు. అది జరిగేలా లేదని సమాచారం.

Related Post