• పెళ్లికి ముందే.. మరో సినిమాలో జంటగా…

    Published Date : 17-Mar-2017 6:34:42 IST

    సమంత – నాగ చైతన్య లది ఎంత హిట్ పెయిరో చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి వీటిల్లో రెండు సూపర్ హిట్లు. నిజ జీవితంలో కూడా ప్రేమికులుగా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వీళ్లిద్దరూ జంటగా మరో సినిమా రానున్నదని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత నాగ చైతన్య కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. వీరి వివాహానికి ముందే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ తో సినిమా చేయాల్సి ఉంది. అదేమవుతుందో మరి!

Related Post