• ఇంతకీ సమంత పాత్ర ఏది?

    Published Date : 07-Dec-2017 3:40:21 IST

    సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో సమంత ఒక జర్నలిస్టు పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇందులో ట్విస్టు ఏమిటంటే.. సమంతది జర్నలిస్టు పాత్ర కాదట. మరో ప్రముఖ నటి జమున పాత్రలో సమంత కనిపిస్తుందనే వార్తలు వస్తున్నాయిప్పుడు. ఈ సినిమాలో సావిత్రితో పాటు ఆ తరం సినీ ప్రముఖుల పాత్రలన్నీ ఉంటాయని మొదటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత చేస్తున్నది జమున పాత్ర అనే టాక్ వినిపిస్తోంది. అసలు సంగతేమిటో మరి.

Related Post