• స్టార్ హీరో.. ఒకటి టీజర్, ఇంకోటి ఫస్ట్ లుక్!

    Published Date : 13-Nov-2017 2:24:02 IST

    తాజాగా ‘టైగర్ జిందా హై’ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన సల్మాన్ ఖాన్ ఇదే సమయంలో.. మరో సినిమాను కూడా క్యూలోకి తీసుకొచ్చాడు. ‘రేస్ 3’తో వస్తున్నాడు ఈ హీరో. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు సల్లూ. రేస్ త్రీ మొదలైందని ఈ ఫస్ట్ లుక్ తో ప్రకటించాడు. మరి ఒకవైపు ఒక సినిమా టీజర్ తో, మరోవైపు ఇంకో సినిమా ఫస్ట్ లుక్ తో సల్లూ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఈ ఏడాది క్రిస్మస్ కు టైగర్ జిందాహై విడుదల కానుండగా, వచ్చే ఏడాది ఈద్ కు రేస్ త్రీ విడుదల కానుంది.

Related Post