• వర్మ, నాగ్ సినిమాకు ముహూర్తం ఖరారు!

    Published Date : 01-Nov-2017 8:39:14 IST

    అసలు జరిగే పనేనా అనే సందేహాన్ని కలిగించిన నాగార్జున, వర్మ కాంబోలో సినిమాకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ సినిమా నవంబర్ ఇరవైవ తేదీన ప్రారంభం కానున్నదని వర్మ ప్రకటించాడు. ఈ విషయాన్ని చెప్పడం తనకు ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోందని వర్మ పేర్కొన్నాడు. దశాబ్దాల తర్వాత నాగ్, వర్మ కాంబోలో సినిమా వస్తోంది. శివ, అంతం వంటి సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరి కాంబో రిపీట్ అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Related Post