• రాఘవేంద్రరావు ఆ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడా?

    Published Date : 07-Sep-2017 6:58:41 IST

    ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా తన ఆఖరి సినిమా అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చెప్పాడని ఆ సినిమా హీరో నాగార్జున అప్పట్లో ప్రకటించాడు. అయితే ఆ సినిమా సరిగా ఆడలేదు. ఆ సినిమానే ఆఖరు అని రాఘవేంద్రరావు కూడా అధికారికంగా ప్రకటన ఏమీ చేయలేదు. ఈ నేపథ్యంలో.. ఈ దర్శకుడి తర్వాతి సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. చాన్నాళ్లుగా ప్రతిపాదనలో ఉన్న ‘రావణ’ను రాఘవేంద్రరావు తీస్తున్నాడని, మోహన్ బాబు, రానాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని సమాచారం.

Related Post