• ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్నానన్న హీరోయిన్!

    Published Date : 10-Nov-2017 9:13:06 IST

    ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు ఇవ్వడానికి కొంతమంది తనతో పడక సుఖాన్ని అడిగారని చెప్పింది రాయ్ లక్ష్మీ. ప్రస్తుతం బాలీవుడ్ అవకాశాల వేటలో ఉన్న ఈ భామ క్యాస్టింగ్ కోచ్ అంశం గురించి స్పందించింది. తను కూడా వేధింపులు ఎదుర్కొన్నాను అని ధ్రువీకరించింది. అయితే అలాంటి ఆఫర్లను తీసుకోలేదని.. వాటికి దూరంగా జరిగానని చెప్పింది. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెరపైకి వచ్చే అమ్మాయిలకు అలాంటి వేధింపులు తప్పవని కూడా రాయ్ లక్ష్మీ వ్యాఖ్యానించడం గమనార్హం. తనకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని, తను మాత్రం వాటికి దూరంగా నిలిచానని ఈమెస్పష్టం చేసింది.

Related Post