• పద్మావతి పేరు మారింది..!

    Published Date : 30-Dec-2017 3:53:47 IST

    వివాదస్పదంగా మారిన పద్మావతి సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ, ఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది. ఆసక్తిదాయకమైన విషయం ఏమిటంటే ఈ సినిమా టైటిల్ మారింది, ‘పద్మావత్’ పేరుతో ఈ సినిమా విడుదల కానున్నదని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు చరిత్రతో ఎలాంటి సంబంధం లేదనే డిస్ క్లైమర్ ను కూడా తప్పనిసరిగా ప్రదర్శించాలని సెన్సార్ బోర్డు ఈ సినిమా రూపకర్తలకు సూచించింది. మొత్తం 26 కట్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం.

Related Post