• ఆ ఒక్కటీ అడక్కు అంటున్న ఎన్టీఆర్..!

    Published Date : 17-Jul-2017 9:32:09 IST

    బిగ్‌బాస్ ప్రోగ్రామ్ గురించి చెప్పమంటే ఎంతైనా చెబుతా కానీ, రెమ్యూనరేషన్ వివరాన్ని మాత్రం అడగొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నటుడు ఎన్టీఆర్. సినిమా పారితోషకం వివరాలను దాచేసినట్టుగానే బిగ్ బాస్ విషయంలో కూడా గుంభనంగా ఉంటున్నాడు ఈ హీరో. అనధికార సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ కు గానూ ఎపిసోడ్ కు యాభై లక్షల రూపాయల వరకూ తీసుకున్నట్టుగా సమాచారం. ఇక తొలి ఎపిసోడ్లో ఎన్టీఆర్ హోస్టింగ్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఎన్టీఆర్ నవ్వు, అరుపు కాస్త ఎక్కువైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related Post