• నయనకు అలాంటి మొహమాటేలేవీ లేవు మరి!

    Published Date : 16-May-2017 8:33:00 IST

    నయనతార.. ఈమె గురించి చెప్పుకోవడంలో సినిమాల సబ్జెక్ట్ ఎంత ఉంటుందో, ఈమె ప్రేమకథలు కూడా అంతే గాఢత కలవి. ప్రేమలో మునిగి తేలడం..అనంతరం బ్రేకప్ చేసుకోవడం, ఆ తర్వాత మరో ప్రేమకథ.. ఇదంతా నయనకు అలవాటైన కథ. ఈ ప్రేమకథల్లో మరో విశేషం..మాజీ ప్రియులతో కూడా నయన సినిమాలు చేయడం. శింబుతో గాఢమైన ప్రేమకథను నడిపి అతడి దూరం అయిన ఆ తర్వాత మళ్లీ అతడితో ఒక సినిమాను చేసింది. ఇప్పుడు మాజీ ప్రియుడు ప్రభుదేవాతో ఇంకో సినిమా చేయనుందట నయన.

Related Post