• ఓవర్సీస్ లో పవన్ ను దాటేసిన నాని..
    Published Date : 15-Jul-2017 6:25:40 IST

    వరస సక్సెస్ లతో మంచి ఊపుమీదున్న యంగ్ హీరో నాని విదేశాల్లో వసూళ్ల విషయంలో దూసుకుపోతున్నాడు. నాని తాజా సినిమా నిన్నుకోరి ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించడంతో ఈ హీరో పవన్ కల్యాణ్ ను దాటేశాడు. పవన్ సినిమాలు అత్తారింటికి దారేదీ, సర్ధార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాలలు ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించాయి. నాని సినిమాల్లో ఈగ, భలేభలే మగాడివోయ్., నేను లోకల్, నిన్నుకోరిలు మిలియన్ డాలర్ల మార్కును చేరాయి. ఎన్టీఆర్ వి కూడా నాలుగు సినిమాలు ఈ స్థాయి వసూళ్లను సాధించాయి.