• నాగార్జున కూడా వెబ్ సీరిస్ లో..?

    Published Date : 30-Dec-2017 3:55:33 IST

    ప్రస్తుతం ఇండస్ట్రీ వెబ్ సీరిస్ ల వైపు టర్న్ అవుతోంది. రానున్న రోజులు వెబ్ సీరిస్ లవే అని దర్శకుడు పూరీ జగన్నాథ్ లాంటి వాళ్లు అంటున్నారు. ఇక ఆర్జీవీ వంటి వాళ్లు వీటి మేకింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు కూడా వీటి వైపు టర్న్ అవుతున్నారు. ఇప్పటికే వెంకటేష్, రానా లు నటిస్తారనే వెబ్ సీరిస్ ఒకటి ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు నాగార్జున కూడా నటించబోతున్నాడనే మాట వినిపిస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే వెబ్ సీరిస్ లో నాగార్జున నటిస్తాడని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Post