• నాగార్జున మళ్లీ ఆ పాత్రలో..?

    Published Date : 08-Jan-2018 8:28:39 IST

    ఇప్పటికే లారెన్స్ దర్శకత్వంలో డాన్ గా నటించాడు నాగార్జున. ఆ తర్వాత భాయ్ సినిమాలోనూ అదే తరహా పాత్రలో నటించాడు. అయితే ఆ రెండు సినిమాలూ డిజాస్టర్స్ అయ్యాయి. కానీ.. ఈ సారి మాత్రం మరోసారి అదే తరహా పాత్రకు రెడీ అవుతున్నాడట ఈ హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని కాంబోలో రానున్న సినిమాలో నాగార్జునది డాన్ పాత్ర అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ రూపొందిస్తున్నాడు.

Related Post