• నాగ్ మరో కుర్ర హీరోతో కలిసి..?

    Published Date : 15-May-2017 9:59:26 IST

    మల్టీస్టారర్ లు చేయడంలో ముందుంటాడు నాగార్జున. ఆయన ట్రాక్ రికార్డే ఈ విషయాన్ని చెబుతోంది. ఈ పరంపరలో నాగ్, నిఖిల్ కాంబోలో ఒక సినిమా రానున్నదనే ప్రచారం ఇప్పటికే ఉంది. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు నాగ్ మరో యంగ్ హీరో నానితో కలిసి ఒక సినిమాలో చేయబోతున్నాడని సమాచారం. ఇది నిజంగా క్రేజీ కాంబోనే. వరస విజయాలతో ఊపు మీదున్న నాని, ఇప్పటికీ ఉత్సాహం ఏమాత్రం తగ్గని నాగ్ ల కాంబోలో సినిమా అంటే ఆసక్తికరమైనదే!

Related Post