• ధనుష్ కు ఝలకిచ్చిన హీరోయిన్!

    Published Date : 19-Mar-2017 10:45:38 IST

    మోనాల్ గుజ్జర్ ధనుష్ కు ఝలకిచ్చింది. సినిమాకు సైన్ చేసి… అంతా ఓకే అనుకున్నాకా మోనాల్ నో చెప్పింది. సదరు సినిమా నుంచి వైదొలిగింది. వీఐపీ సినిమాకు సీక్వెల్ లో మోనాల్ ను ఒక హీరోయిన్ గా తీసుకున్నాడట ధనుష్. తొలి వెర్షన్ లో సురభి చేసిన పాత్రను మోనాల్ తో చేయిస్తూ షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. అయితే.. సినిమాలో తన పాత్రకు అంత ప్రాధాన్యత లేదని భావించిన మోనాల్ ఉన్నట్టుండి నో చెప్పింది. వేరే కారణాలతో సినిమాను చేయలేకపోతున్నానని ధనుష్ కు ఝలకిచ్చింది.

Related Post