• శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు..?

    Published Date : 21-Apr-2017 1:09:03 IST

    అత్యంత భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా రూపొందనున్న మలయాళీ చిత్రం ‘రండామూళం’ లో శ్రీకృష్ణుడి పాత్రకు తెలుగు స్టార్ హీరో మహేశ్ బాబును సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. మహాభారతం ఆధారంగా విరచితమైన నవల ఇది. సినిమాగా చిత్రీకరించనున్నారు. ఇందులో భీముడిగా మోహన్ లాల్ నటించబోతున్నాడని సమాచారం. ఇందులో నాగార్జున, అమితాబ్, ఐశ్వర్యరాయ్ లు కూడా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రతిపాదనకు మహేశ్ ఓకే చెబుతారా? వేచి చూడాలి! వీరంతా నటిస్తే మాత్రం ఇదో భారీ మల్టీస్టారర్ అవుతుంది.

Related Post