• కట్టప్ప పాత్రను ఆయన తిరస్కరించారు!

    Published Date : 17-May-2017 10:29:38 IST

    కట్టప్ప.. బాహుబలితో పాపులర్ అయిన పేరు, పాత్ర. మరి ఈ పాత్రను అంత చక్కగా పోషించడంలో సత్యరాజ్ కూడా అంతే విజయవంతం అయ్యారు. అయితే దర్శకుడు రాజమౌళి దృష్టిలో మొదట ఈ పాత్రకు అనుకున్నది మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ ని. ఆయన చేత ఈ పాత్రను చేయించాలని రాజమౌళి భావించారట. అయితే.. ఈ సినిమా షెడ్యూల్ దాదాపు ఐదేళ్ల పాటు ఉండటంతో మోహన్ లాల్ మరో ఆలోచన లేకుండా నో చెప్పారట. దీంతో ఆ అవకాశం సత్యరాజ్ కు దక్కిందని సమాచారం.

Related Post