• కృష్ణవంశీ.. అది నిజమేనా?

    Published Date : 10-Dec-2017 11:00:46 IST

    వరస ఫెయిల్యూర్లలో ఉన్న దర్శకుడు కృష్ణవంశీ కూడా ఒకరు. ఈ మధ్యనే నక్షత్రంతో కెరీర్ లో మరో సూపర్ ఫ్లాప్ ను జోడించుకున్నాడు ఈ దర్శకుడు. అయితే ఇంత జరిగినా ఇప్పుడు మళ్లీ ఈ దర్శకుడికి స్టార్ హీరోలు ఓకే చెబుతున్నారట. తమిళ నటుడు మాధవన్ తో కృష్ణవంశీ సినిమా చేయబోతున్నాడట. ఇది మల్టీస్టారర్ అని.. ఇందులో ఒక ప్రముఖ తెలుగు నటుడు కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇది మల్టీస్టారర్ సినిమా అని చెబుతున్నారు. మరి ఇది ఎంత మేరకు నిజమో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Post