• ఆ హీరో రాజకీయాలకు వస్తే మద్దతిస్తానన్న నటీమణి

    Published Date : 02-Aug-2017 8:24:33 IST

    కమల్‌హాసన్‌ రాజకీయ రంగ ప్రవేశంపై సీనియర్‌ నటి, కాంగ్రెస్‌ నేత ఖుష్బూ ఈ అంశంపై స్పందించారు. కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు మద్దతిస్తానని ఆమె ప్రకటించారు. కమల్ విషయంలో ఆమె స్పందిస్తూ ‘అవినీతికి వ్యతిరేకంగా కమల్‌ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నా. కమల్‌ తీరు గత రెండు నెలలుగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నా స్నేహితుడు కమల్‌కు నా మద్దతు, ఆదరాభిమానం ఎప్పటికీ ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.

Related Post