• స్టార్ కమేడియన్.. సహనటుడిని చితకబాదాడు!
    Published Date : 19-Mar-2017 10:49:48 IST

    మరోసారి వివాదాస్పదంగా వార్తల్లోకి వచ్చాడు కపిల్ శర్మ. తన సహనటుడు సునిల్ గ్రోవర్ పై కపిల్ చెయి చేసుకున్నాడని, తీవ్రంగా కొట్టాడని తెలుస్తోంది. ఇటీవల మెల్బోర్న్,సిడ్నీల్లో స్టేజ్ షోలు నిర్వహించిన అనంతరం ఎయిరిండియా విమానం భారత్కు తిరిగొస్తుండగా సునిల్ పై కపిల్ చేయి చేసుకున్నట్టు తెలిసింది. కాలర్ పట్టుకొని లేపి.. అతన్ని కొట్టాడు. కపిల్ కొడుతున్నా.. తిడుతున్నా సునీల్ మౌనంగా భరిస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో కపిల్ తాగి ఉన్నాడని, ‘నువ్వు నా నౌకర్వి’ అంటూ సునీల్ని అడ్డగోలుగా తిడుతూ దాడి చేశాడని తెలుస్తోంది.