• రజనీకాంత్ విషయంలో కమల్ వ్యాఖ్యలు?

    Published Date : 11-Jan-2018 5:54:09 IST

    తను ఒక పత్రికకు రాసే రెగ్యులర్ ఫీచర్ లో కమల్ హాసన్ ఆసక్తిదాయకమైన కామెంట్లు చేశారు. తన రాజకీయ ప్రయాణంలో భాగంగా మిత్రులను శత్రువులుగా మార్చుకోలేను అని కమల్ స్పష్టం చేశారు. బహుశా ఈ వ్యాఖ్యలు తన సన్నిహిత నటుడు రజనీకాంత్ ను ఉద్దేశించే అని అనుకోవాల్సి వస్తోంది. సినీరంగంలో పోటీ ఉన్నా.. కమల్ హాసన్, రజనీకాంత్ లు స్నేహితులుగానే ఉన్నారు. ఇప్పుడు చెరో రాజకీయ పార్టీతో రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ స్పందిస్తూ.. రాజకీయం కోసం రజనీని శత్రువుగా మార్చుకోలేను అన్నాడనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

Related Post