• కాబోయే వాడెలా ఉండాలో చెప్పిన కాజల్!
    Published Date : 09-Jul-2017 12:56:03 IST

    కాజల్ పెళ్లి .. గత కొన్నాళ్లుగా చర్చలో ఉన్న అంశం. ఈమె చెల్లెలు చాన్నాళ్ల కిందటే పెళ్లి చేసుకుని సెటిలైంది. కాజల్ కు కూడా అవకాశాలు తగ్గుముఖం పడుతూ ఉండటంతో పెళ్లి చేసుకుని సెటిలవుతోందనే ప్రచారం చాన్నాళ్లుగా సాగుతోంది. అయితే ఈ మధ్య కెరీర్ మళ్లీ పుంజుకోవడంతో ఇప్పుడు పెళ్లి ఉద్దేశమే లేదంటోంది కాజల్. ఇంకా అలాంటి వాడు తారస పడలేదని, అది ఎవరైనా బెస్ట్ అనిపించుకోవాలి అని చెప్పుకొచ్చింది. అయితే ఎవరైనా అతడు ఆరు అడుగుల ఎత్తుకు తక్కువ ఉండకూడదని కాజల్ అభిప్రాయపడింది.