• స్టార్ హీరోయిన్.. కొత్తలో అలా చేయాల్సొచ్చిందట!
    Published Date : 20-Mar-2017 7:07:38 IST

    కొత్తగా అవకాశాల కోసం వచ్చిన భామలను ఇండస్ట్రీలోని వ్యక్తులు వేధించడం మాటేమిటో కానీ, తన వరకూ అయితే.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవగాహనలేక కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వచ్చిందని అంటోంది కాజల్ అగర్వాల్. అదెలా అంటే.. అప్పట్లో తను అవగాహన లేక అసభ్యంగా కనిపించే కొన్ని సీన్లలో చేశానని కాజల్ చెబుతోంది. కొత్తగా అవకాశాలను సంపాదించుకోవాలని అలా చేయాల్సి వచ్చిందని కాజల్ చెప్పుకొచ్చింది. హీరోయిన్లను అలా చూపే సంస్కృతి ఉందని వాపోయింది. ఇప్పుడు మాత్రం తను అలా చేయడం లేదంటోంది.