• సొంత డబ్బింగ్ చెప్పుకొంటున్న మరో హీరోయిన్

    Published Date : 10-Dec-2017 10:58:27 IST

    హరిప్రియ.. పలు తెలుగు సినిమాల్లో నటించిన కన్నడ అమ్మాయి. బెంగళూరులో పుట్టి పెరిగిన ఈ అమ్మడి సొంతూరు చిక్ బళాపురం. రాయలసీమ, కర్ణాటక బోర్డర్ లో ఉండే ఆ ఊళ్లో తెలుగే ఎక్కువగా మాట్లాడతారు. మరి అక్కడ నుంచినే అలవాటు అయ్యిందో లేక ఇండస్ట్రీలోకి వచ్చాకా చేర్చుకుందో కానీ.. ఇప్పుడు ఓన్ డబ్బింగ్ కు రెడీ అంటోంది ఈ భామ. బాలయ్య హీరోగా నటిస్తున్న జై సింహాలో ఒక హీరోయిన్ గా కనిపించనున్న హరిప్రియ తన పాత్రకు తనే డబ్ చెప్పుకోనున్నదని సమాచారం.

Related Post