• నలభై కోట్ల మార్కు దిశగా వెళ్తున్న చోటా సినిమా!
    Published Date : 06-Aug-2017 12:58:21 IST

    ఈ మధ్య కాలంలో పరిమిత బడ్జెట్ లో రూపొంది అత్యంత భారీ వసూళ్లను సాధిస్తున్న సినిమాగా నిలుస్తోంది ఫిదా. ఈ సినిమా వసూళ్లలో షేర్ కు సంబంధించిన గణాంకాలు వెల్లడి అవుతున్నాయి. ఇది షేర్ విషయంలో నలభై కోట్ల మార్కును రీచ్ అవుతోందని సమాచారం. ‘దర్శకుడు’, ‘నక్షత్రం’ వంటి సినిమాలు నిరాశ పరచడంతో ఫిదాకు మూడో వారంలో కూడా తిరుగు లేకుండా పోయింది. వసూళ్ల వేట కొనసాగుతోంది. గ్రాస్ కలెక్షన్లు అరవై కోట్లను, షేర్ నలభై కోట్లను రీచ్ అవుతోందని సమాచారం.