• ధునుష్ కు ఫుల్ రిలీఫ్..!

    Published Date : 21-Apr-2017 1:07:29 IST

    ధనుష్‌ తమ కొడుకేనంటూ పడ్డ పిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ కొట్టివేసింది. అతడు చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయాడని మేలూరుకు చెందిన కదిరేశన్‌-మీనాక్షి దంపతులు మధురై కోర్టును ఆశ్రయించారు. రుజువులుగా కొన్ని పత్రాలను సైతం ఆ దంపతులు సమర్పించారు. పత్రాల్లో పేర్కొన్నట్టుగా ధనుష్‌కు పుట్టుమచ్చలు లేకపోవడంతో లేజర్‌ ట్రీట్‌మెంట్‌తో ఆయన తొలగించుకొని ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. న్యాయస్థానం డీఎన్‌ఏ టెస్టుకు ఆదేశాలు ఇవ్వగా.. అందుకు ధనుష్‌ నిరాకరించాడు. వాదనలు విన్న మధురై బెంచ్‌ వృద్ధ దంపతుల పిటిషన్‌ను తోసిపుచ్చి.. ధనుష్‌కు ఊరటనిచ్చింది.

Related Post