• ధర్మాభాయ్ గా నాగచైతన్య?

    Published Date : 29-Dec-2017 4:55:46 IST

    ఢమరుకం సినిమా తర్వాత శ్రీనివాసరెడ్డి, నాగచైతన్య కాంబోలో హలో బ్రదర్ రీమేక్ కానున్నదని వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు కానీ.. ఇప్పుడు వీరి కాంబోలో ఒక సినిమా రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు ధర్మాభాయ్ అనే టైటిల్ కూడా పెట్టారట. ఆకుల శివ ఈ సినిమాకు కథను రాసినట్టు సమాచారం. ఇది శ్రీనివాసరెడ్డి సినిమాల తరహా ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ సవ్యసాచి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎంటర్ టైనర్ చేయాలనే భావనతో ధర్మాభాయ్ ని పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం.

Related Post