• ఆ ఒక్క మాటపై వంద కోట్లకు నష్టపరిహారం!

    Published Date : 02-Aug-2017 8:26:12 IST

    కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్ పై సంచలన స్థాయి నష్టపరిహార పిటిషన్ కోర్టులో దాఖలైంది. బిగ్‌బాస్ కార్యక్రమంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక తమిళ రాకీయ నేత వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశాడు. మరి బిగ్‌బాస్ అంతలా ఏం చేసింది అంటే.. ఈ కార్యక్రమంలో పాల్గొనే గాయత్రీ రఘురాం మాట్లాడిన ఒక మాటే దీనికి కారణం. ‘మురికివాడల్లో బతికేవాళ్లు చేసినట్టుగా చేస్తున్నావ్..’ అని ఆమె వ్యాఖ్యానించింది. ఈ విధంగా ఆమె మురికివాడల ప్రజలను కించపరిచిందని పిటిషన్ దాఖలు చేశారు.

Related Post