• బాహుబలి.. మరే సినిమాకూ అందనంత ఎత్తుకు…?

    Published Date : 17-May-2017 10:30:54 IST

    మరే భారతీయ సినిమాకూ అందనంత ఎత్తుకు చేరేలా ఉంది బాహుబలి. దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించే దిశగా సాగుతోంది ఈ సినిమా. ఇప్పటి వరకూ అన్ని భాషల్లోనూ కలిసి ఇండియా, ఓవర్సీస్ లో ఈ సినిమా పద్నాలుగువందల యాభై కోట్ల రూపాయల మార్కును రీచ్ అయినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీకెండ్ కళ్లా పదిహేనువందల కోట్ల రూపాయల మార్కును దాటేసేలా ఉంది ఈ సినిమా. ఆపై బాహుబలి టార్గెట్ రెండు వేల కోట్ల రూపాయల మార్కే!

Related Post