• ‘జై సింహా’ ఫస్ట్ లుక్..!!

    Published Date : 01-Nov-2017 8:41:31 IST

    వివిధ టైటిల్స్ వినిపించినా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమాకు జై సింహా అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. సి కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో బాలయ్య లాఠీతో కనిపిస్తుండగా వెనుకవైపున ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుండటం గమనార్హం. నయనతారతో పాటు ఈ సినిమాలో హరిప్రియ కూడా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు.

Related Post