• బాలయ్య సినిమా వ్యాపారంలో వెనుకబడిందా?

    Published Date : 06-Aug-2017 12:49:36 IST

    బాలయ్య హీరోగా వస్తున్న ‘పైసా వసూల్’ సినిమా ప్రీ రిలీజ్ వ్యాపారంలో బాగా వెనుకబడి ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కు అవుతున్న వ్యాపారానికి సంబంధం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. పబ్లిసిటీ, వడ్డీలతో కలుపుకుని పైసావసూల్ కు నలభై ఐదు కోట్ల రూపాయల వరకూ ఖర్చు అయ్యిందని, అయితే ప్రీ రిలీజ్ మార్కెట్ లో మాత్రం ఈ సినిమా ముప్పై కోట్ల మార్కు వరకూ మాత్రమే రీచ్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కేవలం రెండు కోట్ల వ్యాపారాన్నే చేసిందట.

Related Post