• బాహుబలి’ పంట పండింది.. మరో 25కోట్లు ?

    Published Date : 10-Aug-2017 7:06:00 IST

    థియేటరికల్ రిలీజ్ లో 1,500 కోట్ల రూపాయల పై మొత్తాన్ని సంపాదించిన బాహుబలి-2 కి సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ మార్కెట్ లో పాతిక కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ వాళ్లు బాహుబలి-2 కు ఈ మొత్తం వెచ్చించి కొనుక్కొన్నారనేప్రచారం జరుగుతోంది. బాహుబలి2 అన్ని భాషల వెర్షన్లూ కలిసి ఈ ధర పలికాయని సమాచారం. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు పోటీ పడటంతో ఈ రేటు వచ్చిందని తెలుస్తోంది.

Related Post