• అర్జున్ రెడ్డి.. 10నిమిషాలు కాదు, 40 నిమిషాలా?

    Published Date : 05-Sep-2017 6:43:31 IST

    తను ఈ సినిమాను మొత్తం నాలుగు గంటల వ్యవధికి తగ్గట్టుగా తీశానని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి ఇది వరకే ప్రకటించాడు. అయితే లెంగ్త్ ఎక్కువ అవుతుందని.. గంట నిడివిని కట్ చేసినట్టుగా ప్రకటించాడు. మరి ఈ మూడు గంటల సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తోందని..అందుకే ఈ సినిమా వ్యవధిని పెంచుతామని ఈ సినిమా యూనిట్ చెబుతోంది. అయితే పెంపుదల పది నిమిషాలు అని మొదట చెప్పినా, ఇప్పుడు ఏకంగా 40 నిమిషాలంటున్నారు. అదే జరిగితే అర్జున్ రెడ్డి అత్యంత లెంగ్తీ తెలుగు మూవీ అవుతుంది.

Related Post