• అర్జున్ రెడ్డిని మిస్సయ్యానని ఫీలైన హీరో!

    Published Date : 03-Oct-2017 7:02:21 IST

    అర్జున్ రెడ్డి సినిమా కథ ముందుగా తన వద్దకే వచ్చిన విషయం వాస్తవమే అన్నాడు హీరో శర్వానంద్. తనే ఆ కథను కొంతమంది నిర్మాతల వద్దకు పంపానని..అయితే వారంతా ఆ సినిమాను చేయడానికి ముందుకు రాలేదని శర్వా చెప్పాడు. అలాంటి సినిమాను మిస్సైనందుకు బాధగానే ఉందన్నాడు. ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు అలాంటి కథ ఉంటే చూడమని అంటున్నారన్నారు. అయితే అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ చక్కగా సెట్ అయ్యాడని, ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడని శర్వా అభిప్రాయపడ్డాడు.

Related Post