• అమరజవాన్ల కోసం స్టార్ హీరో కోటి రూపాయల వితరణ

    Published Date : 17-Mar-2017 6:33:24 IST

    ఛత్తీస్గఢ్లో నక్సల్స్ దాడిలో వీరమరణం పొందిన ఒక్కో సీఆర్పీఎఫ్ జవాను కుటుంబానికి రూ.9లక్షల చొప్పున నగదును అందజేశారు హీరో అక్షయ్ కుమార్. మార్చి 11న జవాన్లపై నక్సల్స్ దాడిలో 12 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. దాడి విషయం తెల్సుకుని, జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ను అక్షయ్ సంప్రదించారని అధికారులు వెల్లడించారు. జవాన్ల కుటుంబీకుల బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకుని ఆయా ఖాతాలకు అక్షయ్ నగదును బదిలీచేశారని చెప్పారు.

Related Post