• అఖిల్ సినిమాకు.. ప్రచారంలోకి కొత్త టైటిల్!

    Published Date : 10-Aug-2017 7:11:51 IST

    విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమాకు టైటిల్ విషయంలో చాలా ప్రచారమే జరుగుతూ వస్తోంది. ఈ సినిమాకు ‘జున్ను’ అనే టైటిల్ పెట్టారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని తర్వాత ఖండించారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ వారు ‘రంగుల రాట్నం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయడంలో అఖిల్ సినిమా టైటిల్ అదే అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఈ సినిమా రూపకర్తలు స్పందించలేదు.

Related Post