• ఐశ్వర్యరాయ్ తండ్రి మృతి

    Published Date : 18-Mar-2017 8:48:23 IST

    ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ కుటుంబంలో విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి క్రిష్ణరాజ్ రాయ్ శనివారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఐశ్వర్య సన్నిహితులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి క్రిష్ణరాజ్ రాయ్ కేన్సర్ సమస్యలతో సతమతవుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Related Post