• బాలయ్య సినిమాలో తను లేనన్న హీరోయిన్!
  Published Date : 17-Oct-2017 10:24:09IST

  కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో తను నటించడం లేదని ట్వీట్ చేసింది రెజీనా. ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వారితో పాటు రెజీనా కూడా నటిస్తున్నట్టుగా ఇంత వరకూ వార్తలు వచ్చాయి. రెజీనా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటోందని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆమె వాటిని ఖండించింది. తను ఆ సినిమాలో నటించడం లేదు.. అని స్పష్టం చేసింది. మరి ఇది తప్పుకోవడమా, తప్పించడమా, మొదట వచ్చినవన్నీ రూమర్లేనా.. అనేది సందేహంగా మిగిలింది. ఆ సినిమా యూనిట్ కు బెస్ట్ విషెస్ చెప్పింది రెజీనా.

  Read More
 • 34 మంది హీరోయిన్లపై రేప్‌లు, లైంగిక వేధింపులు!
  Published Date : 15-Oct-2017 10:35:02IST

  హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టెన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న హీరోయిన్ల జాబితా క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఆయనపై ముప్పై నాలుగు మంది హీరోయిన్లు ఆ తరహా ఆరోపణలు చేయడం గమనార్హం. వీరిలో ఏంజెలీనా జోలీ వంటి స్టార్ హీరోయిన్ కూడా ఉంది. ఇంకా ఎమిలీ నెస్టర్, ఏసియో అర్జెంటో, లూరెన్ ఒకానర్ వంటి వాళ్లుకూడా వివిధ సందర్భాల్లో హార్వే తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను హార్వే తరఫు వారు ఖండిస్తున్నారు. ఇవన్నీ కుట్రపూరితం అని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

  Read More
 • ఇక నటుడిగానే కొనసాగుతా: దర్శకుడు
  Published Date : 15-Oct-2017 10:33:21IST

  దర్శకుడిగా కంటే నటుడిగానే కొనసాగడానికి ఇష్టపడతాను అంటున్నాడు ఎస్‌జే సూర్య. దర్శకుడిగా అంత ఫామ్ లో లేకపోవడం, నటుడిగా మంచి ఫామ్ లో ఉండటంతో ఇతడు ఈ ప్రకటన చేసినట్టుగా కనిపిస్తున్నాడు. సూర్య కెరీర్ ఆరంభంలో మంచి మంచి సినిమాలు తీశాడు. వాలి వంటి సూపర్ హిట్ సినిమాను, ఖుషీ వంటి హిట్ సినిమాను రూపొందించాడు. అయితే ఆ తర్వాత కొన్ని ఫ్లాఫులు ఎదురయ్యాయి.. నటుడిగా మారి విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇక నటుడిగానే అని, దర్శకత్వం మీద ఆసక్తి తగ్గిపోయిందని.. సూర్య చెబుతున్నాడు.

  Read More

 • Widget not in any sidebars
 • నిర్మాత తప్పుకోవడంతో హీరోనే నిర్మాతగా!
  Published Date : 13-Oct-2017 3:30:49IST

  తను హీరోగా రూపొందుతున్న ఒక సినిమా నిర్మాణ బాధ్యతలను తనే స్వీకరించాడట సుధీర్ బాబు. మహేశ్ బావగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి.. హీరోగా నిలదొక్కుకునే పనిలో ఉన్న సుధీర్ హీరోగా రాజశేఖర్ నాయుడు అనే దర్శకుడి సారధ్యంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ హఠాత్తుగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడట. ఈ నేపథ్యంలో సబ్జెక్టుపై నమ్మకంతో సుధీర్ బాబే ఈ సినిమాను నిర్మించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ హీరో నిర్మాణంలో వస్తున్న తొలి సినిమా ఇదే కానుంది.

  Read More
 • ఎన్టీఆర్ బయోపిక్ హిందీలో కూడా..!
  Published Date : 13-Oct-2017 3:29:09IST

  బాలయ్య హీరోగా నటించే ఎన్టీఆర్ బయోపిక్ హిందీలో కూడా రూపొందనుందని తెలుస్తోంది. ఈ మేరకు ట్రేడ్ ఎనలిస్టు తరణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ పెట్టాడు. ఆ సినిమాలో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కనిపించనున్నాడని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నాడు. తేజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తండ్రి జీవిత కథ ఆధారంగా సినిమాను తీస్తానని అంటున్న బాలయ్య ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన చేయాల్సి ఉందికా. అయితే ఈ సినిమా హిందీలోనూ విడుదల అవుతుందని ఇప్పుడు వార్తలొస్తున్నాయి.

  Read More
 • ‘హలో..’లో ఆ సీనియర్ హీరో కూడా..!
  Published Date : 12-Oct-2017 9:15:10IST

  అక్కినేని అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హలో’ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఇందులో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నాడనే మాట వినిపిస్తోంది. ఇది వరకూ నాగచైతన్య సినిమా ‘ప్రేమమ్’లో వెంకీ కనిపించాడు. ఆ సినిమా హిట్టైంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ వెంకీని ఒక ఆసక్తికరమైన పాత్రలో చూపనున్నాడట విక్రమ్ కుమార్. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఏమీ లేదింకా.

  Read More

 • Widget not in any sidebars
 • ముస్లిం అని పెళ్లి చేసుకోవద్దన్నారు: హీరోయిన్
  Published Date : 09-Oct-2017 7:22:49IST

  వైవాహిక జీవితం తనకు ఇంకా అలవాటు కాలేదని అంటోంది ప్రియమణి. ఎందుకంటే.. పెళ్లి అయిన మూడో రోజు తను షూటింగ్ కోసం వెళ్లిపోయాను అని, దీంతో భర్తతో కలిసి ఉండటం ఇంకా సరిగా అనుభవంలోకి రాలేదని ఈమె చెబుతోంది. అయితే తన భర్త చాలా మంచివాడని, తనను వంటింటికే పరిమితం కావాలని కోరుకునే వాడు కాదని ప్రియమని చెప్పింది. తను ముస్లింని పెళ్లి చేసుకున్నాను అని .. అయితే కొంతమంది వద్దు అని మొదట్లో తనను వారించారని, కానీ తనకు ఇష్టమైంది కాబట్టి చేసుకున్నాను అని ప్రియమణి చెప్పింది.

  Read More
 • హాట్ నటీమణి.. ప్రేమలో పడిందా!
  Published Date : 09-Oct-2017 7:20:40IST

  ఒకవైపు ‘జూలీ-2’తో సంచలనం రేపుతున్న రాయ్ లక్ష్మీ ఇదే సమయంలో ప్రేమలో కూడా పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిలయ్యే ప్రయత్నంలో ఉన్న ఆమె.. అక్కడే బాయ్ ఫ్రెండ్ ను సంపాదించిందట. నటుడు, మోడల్ అయిన హనీఫ్ హీలాల్ అనే వ్యక్తితో లక్ష్మీ ప్రేమలో పడినట్టుగా తెలుస్తోంది. వీళ్లిద్దరూ కలిసి తిరుగుతున్నారని, డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం పై ఇంకా లక్ష్మీ స్పందించలేదు. ఇది వరకూ కూడా ధోనీతో ముడిపెడుతూ లక్ష్మీ పేరు ప్రచారంలోకి వచ్చింది.

  Read More
 • అక్రమసంబంధం గోల.. హీరోకే అందరి మద్దతు!
  Published Date : 09-Oct-2017 7:18:51IST

  బాలీవుడ్ లో కొన్ని నెలలుగా హాట్ టాపిక్ గా నిలుస్తున్న హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల వ్యవహారంలో చాలా మంది హృతిక్ కే మద్దతు పలుకుతున్నారు. హృతిక్ పేరు ప్రస్తావించుకుండానే.. అతడు అలాంటి పని చేసి ఉండడు అని ఫర్హన్ పోస్టు పెట్టగా, దాన్ని ట్వింకిల్ ఖన్నా, యామీ గౌతమ్, కరణ్ జోహర్, సోనమ్ కపూర్, సోనాలీ బింద్రేలు సమర్థించారు. దీంతో వీళ్లంతా హృతిక్ మద్దతుదారులే అనుకోవాల్సి వస్తోంది. అయితే వీళ్లందరినీ కంగనా చెల్లెలు తప్పు పట్టింది. అంతా ఒకటైనా తన అక్క పోరాడగలదు అని విశ్వాసం వ్యక్తం చేసింది.

  Read More

 • Widget not in any sidebars
 • తాగి కారు నడిపిన హీరో.. అరెస్టుకు ఆదేశం!
  Published Date : 07-Oct-2017 10:32:16IST

  మద్యం సేవించి కారు నడిపిన తమిళ హీరో జై చిక్కుల్లో పడ్డాడు. ఈ మేరకు ఆయనపై చెన్నైలోని ఒక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు రావాలని ఇది వరకే ఆదేశించినా.. జై స్పందించకపోవడంతో న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. సెప్టెంబర్ 21 తేదీన జై తాగి కారు నడిపాడు. చెన్నైలో ఒక ఫ్లై ఓవర్ ను ఢీ కొట్టి పోలీసులకు దొరికాడు. పోలీసులు అరెస్టు చేశారు, బెయిల్ పై బయటకు వచ్చాడు. కోర్టు ముందు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

  Read More
 • మహానటిలో రాజేంద్ర ప్రసాద్ కూడా..!
  Published Date : 05-Oct-2017 1:02:27IST

  మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘మహానటి’ సినిమాలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల పాత్రలకు దాదాపు అంతా ఖరారు అయినట్టే అని తెలుస్తోంది. ఈ సినిమాలో సావిత్రి పెదనాన్న పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారట. ఇక రచయిత, నిర్మాతగా చక్రపాణి, శివాజీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబులు నటిస్తున్న విషయం విదితమే. అయితే ఎటొచ్చీ తెలుగు లెజండరీ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలకే ఇంకా నటులు దొరకలేదని సమాచారం.

  Read More
 • స్టార్ హీరో సినిమాకు టైటిల్ తలనొప్పి!
  Published Date : 05-Oct-2017 1:01:09IST

  విజయ్ హీరోగా రూపొందిన తమిళ సినిమా ‘మెర్సల్’కు టైటిల్ తలనొప్పి తీవ్రం అయ్యింది. ఈ సినిమా ‘అదిరింది’ పేరుతో తెలుగులో విడుదల అవుతోంది. టెన్షనంతా తమిళ టైటిల్ విషయంలోనే. తను ఇది వరకూ ‘మెర్రసలైటన్’ పేరుతో ఒక టైటిల్ ను రిజిస్టర్ చేయించాను అని, ఇఫ్పుడు విజయ్ సినిమా టైటిల్ తో తన సినిమాకు ఇబ్బంది కలుగుతోందని ఒక నిర్మాత కోర్టుకు ఎక్కాడు. ఇరు పక్షాల వాదనల అనంతరం అక్టోబర్ మూడో తేదీ వరకూ ఈ సినిమా టైటిల్ ను కోర్టు ప్రీజ్ చేసింది. శుక్రవారం తుది తీర్పు రానుంది.

  Read More

 • Widget not in any sidebars
 • మోడీపై మరోసారి స్పందించిన ప్రకాష్‌రాజ్
  Published Date : 05-Oct-2017 12:59:45IST

  మోడీ తన కన్నా మహానటుడు అని వ్యాఖ్యానించి వార్తల్లోకి ఎక్కిన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఆ అంశంపై మరోసారి స్పందించాడు. తనకు మోడీ అంటే గౌరవం అని అంటూనే.. అన్ని విషయాల్లోనూ ప్రధానితో ఏకీభవించాల్సిన అవసరం లేదు కదా.. అని ఈ నటుడు ప్రశ్నించాడు. తను ఎప్పుడైనా, ఎక్కడైనా నిజమే మాట్లాడతాను అని, తనను తిడుతున్న వారికి ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం లేదని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించాడు. తను ప్రధాని విషయంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడతాను అని ప్రకాష్ రాజ్ అన్నాడు.

  Read More
 • భారతీయుడు-2, అత్యంత భారీగా..!
  Published Date : 03-Oct-2017 7:05:26IST

  భారతీయుడు సినిమాకు సీక్వెల్ రాబోతోందని దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు. కమల్ ప్రధాన పాత్రలో నటిస్తాడని… శంకర్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాను తమిళ, తెలుగుతో పాటు.. ఇతర భారతీయ భాషల్లో కూడా రూపొందిస్తామని ఆయన ప్రకటించాడు. ప్రస్తుతం శంకర్ రోబో-2 పనుల్లో బిజీగా ఉన్నాడని, ఆ సినిమా పూర్తి అయిన తర్వాత భారతీయుడు-2 ని ఆయన చేపడతాడని రాజు ప్రకటించాడు.

  Read More
 • ‘క్వీన్’రీమేక్ ఎట్టకేలకూ పట్టాలెక్కింది!
  Published Date : 03-Oct-2017 7:04:05IST

  దక్షిణాది భాషల్లో క్వీన్ రీమేక్ ప్రతిపాదన పాతదే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలు మార్లు ప్రకటనలు, వాయిదాలతో కాలం గడిచిపోగా.. ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కింది. క్వీన్ తెలుగు వెర్షన్లో తమన్నా నాయికగా నటిస్తూ ఉండగా, తెలుగు వెర్షన్ కు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత ఈ దర్శకుడు మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడు. కన్నడ వెర్షన్ కు రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తుందని సమాచారం.

  Read More